ఎన్టీఆర్ పాత్ర అలాగే ఉండాలంటున్న విశాల్!
హీరో విశాల్ కు తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. విశాల్ చిత్రాలు రెండు భాషల్లో విడుదలవుతుంటాయి. తాజాగా విశాల్ యంగ్టైగర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రం టెంపర్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. నెగిటివ్ షెడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో ఎన్టీఆర్ నటవిశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
ఇటీవలే తమిళ రీమేక్ చిత్రం ప్రారంభమైంది. డెబ్యూ దర్శకుడు వెంకట్ మోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మాత. ఈ చిత్ర కథ విషయంలో దర్శకుడికి కొన్ని సూచనలు చేశాడట. చిన్న చిన్న మార్పులు ఓకే కానీ, ఎన్టీఆర్ ఒరిజినల్ క్యారెక్టర్ లో ఎలాంటి మార్పులు చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది.

తెలుగు వర్షన్ తరహాలోనే తమిళంలో కూడా విశాల్ నటించబోతున్నాడు. విశాల్ కు జోడిగా ఈ చిత్రంలో రాశి ఖన్నా నటిస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన కాజల్ నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











