అమలాపాల్‌ని వేధించిన వెధవ ఆటకట్టించాం.. మీటూపై విశాల్ వ్యాఖ్యలు!

మీటూ ఉద్యమం బాలీవుడ్ ని ఊపేస్తోంది. చిన్మయి సంచలన వ్యాఖ్యల కారణంగా మీటూ సెగ కోలీవుడ్ ని కూడా తాకింది. ప్రముఖ రచయిత వైరముత్తు తనని వేధించిన సంఘటనలని చిన్మయి బట్టబయలు చేసింది. దీనితో కోలీవుడ్ లో కూడా మీటూ ఉద్యమం అగ్గిరాజేసింది. ఆ తరువాత చిన్మయి పలువురి ప్రముఖుల వేధింపులని బయటపెడుతూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజగా తమిళ సినీ ప్రముఖులపై వస్తున్న లైంగిక వేధింపుల అంశం, మీటూ ఉద్యమం గురించి గురించి హీరో విశాల్ స్పందించాడు.

అమలాపాల్‌ని వేధించారు

అమలాపాల్‌ని వేధించారు

గతంలో హీరోయిన్ అమలాపాల్ కు కూడా వేధింపులు ఎదురయ్యని విశాల్ తెలిపాడు. ఆమె నేరుగా నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసింది. వేగంగా స్పందించి ఆ వెధవ అటకట్టించాం అని విశాల్ తెలిపాడు. అతడిని అరెస్టు చేయించాం అని అని తెలిపాడు. నడిగర్ సంఘం పై తీరుపై అమలాపాల్ కూడా హర్హం వ్యక్తం చేసిందని తెలిపాడు.

మీటూ ఉద్యమానికి మద్దత్తు

మీటూ ఉద్యమానికి మద్దత్తు

చిన్మయి, తనుశ్రీ దత్త వంటి ప్రముఖులు చేస్తున్న ఆరోపణలని తాను పరిగణలోకి తీసుకుంటున్నాం అని విశాల్ తెలిపాడు. మీటూ ఉద్యమానికి మద్దత్తు ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఇండస్ట్రీలో మహిళలు తమ సమస్యలని బయటకు చెప్పుకోవడం మంచిదే అని విశాల్ తెలిపాడు. వారి కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నట్లు తెలిపాడు.

 వెంటనే చర్యలు

వెంటనే చర్యలు

ఇండస్ట్రీలో వేధింపులు ఎదురైతే వెంటనే మాతో చెప్పండి అని విశాల్ ప్రకటించాడు. మీ సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చాడు. వరుసగా లైంగిక వేధింపులు వస్తుండడంతో తమిళ చిత్ర పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందనే చర్చ సినీ ప్రముఖుల్లో జరుగుతోంది. అందుకే నడిగర్ సంఘం వెంటనే స్పందించింది.

 పందెంకోడి2

పందెంకోడి2

పందెంకోడి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విశాల్ మీటూపై ఈ వ్యాఖ్యలు చేశాడు. దసరా కానుకగా పందెంకోడి2 చిత్రం అక్టోబర్ 18 న విడుదలవుతోంది. ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X