For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ కోసం ‘సినిమా’ వదులుకొన్న హీరోగారు..!?

    By Sindhu
    |

    తెలుగువాడైన తమిళ హీరో విశాల్ ఇటీవల ఓ హీరోయిన్ కోసం ఓ సినిమాని త్యాగం చేశాడు. దర్శకుడు శివ దర్శకత్వంలో విశాల్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను తీసుకోవాలని దర్శకుడు భావించాడట. అయితే, మన హీరోగారు మాత్రం 'నో… తమన్నా వద్దు… రీమాసేన్ ని తీసుకోండి" అన్నాడట. దాంతో డైరెక్టర్ కి కోపం వచ్చి, కుదరదని చెప్పాడు. అయితే, 'ఈ సినిమా నేను చేయను" అంటూ విశాల్ భీష్మించాడట. దాంతో, ఇక ఆ సినిమానే డ్రాప్ చేసుకున్న డైరెక్టర్ శివ డైరెక్ట్ గా హైదరాబాదొచ్చి, రవితేజతో ఆ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇలా రీమాసేన్ కోసం విశాల్ ఓ సినిమా వదులుకున్నాడని కోలీవుడ్ లో ఇప్పుడంతా చెప్పుకుంటున్నారు. మరి, విశాల్ కి రీమాపై అంత ప్రేమెందుకంటారు?

    ప్రస్తుతం విశాల్‌, ఆర్య హీరోలుగా బాల దర్శకత్వంలో విజయ్‌ కృష్ణ నిర్మించిన చిత్రం 'వాడు- వీడు'. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్‌ జరుపుకుంటోంది. తెలుగు ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రతి సినిమాలోను హీరో చేత ఏదో ఒక విచిత్ర వేషం వేయించే అలవాటున్న తమిళ దర్శకుడు బాలా తొలిసారి తన శైలికి భిన్నంగా పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ ని 'అవన్ ఇవన్" పేరుతో తెరకెక్కిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తీస్తే తన ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నాడో ఏమో, హీరో విశాల్ ని ఇందులో నపుంసకుడిగా చూపిస్తున్నాడు.

    English summary
    Tamil cinema news sources buzzed with the news that cinematographer turned director Siva is planning for a movie with Tamanna and Vishal in lead. The project was also supposed to be finalized and the shooting was to begin from July 2011.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X