సీనియర్ హీరోతో అమలా పాల్ ఘాటైన లిప్ లాక్.. ఆ సీన్ కోసం బట్టలు లేకుండా..

బ్యూటీఫుల్ గ్లామరస్ హీరోయిన్ అమలా పాల్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటూ ఉంటుంది. ఇక గ్లామర్ విషయంలో కూడా ఆమె హద్దులు దాటే విధానం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. మొదట్లో ట్రెడిషినల్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన అమలా పాల్ ఈమధ్య మాత్రం అంతకుమించి అనేలా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా అయితే ఏకంగా ఆమె లిప్ లాక్ సీన్స్ తో అలాగే అర్ధనగ్నంగా నటించింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

వరుసగా అవకాశాలు:దశాబ్దకాలం క్రితం ప్రేమఖైది అనే తమిళ్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఇద్దరమ్మాయిలతో. నాయక్ సినిమాలో హీరోయిన్ నటించే ఛాన్స్ ని సొంతం చేసుకుంది. అదే స్పీడ్ ని కొనసాగించి ఉంటే తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యేది.

Heroine Amala Paul latest lip lock scene viral in social media

పెళ్లయిన రెండేళ్లకే:అయితే తమిళంలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. రెండేళ్ళలోనే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక పెళ్లి బంధం నుంచి బయటకి వచ్చిన తర్వాత అమలాపాల్ అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది. కొన్ని ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా చేసింది.

ఫొటోలు లీక్:అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే ఈ బ్యూటీకి రాలేదనే చెప్పాలి. ఆ మధ్య తన రెండో పెళ్లి వివాదంలో ఈ బ్యూటీ ఇరుక్కుంది. ఓ పంజాబీ గాయకుడిని అమలాపాల్ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు బయటకి వచ్చాయి. తరువాత ఏమైందో అవి ఒక యాడ్ షూట్ కోసం తీసిన ఫోటోలు అంటూ కలరింగ్ ఇచ్చింది.

Heroine Amala Paul latest lip lock scene viral in social media

ఈ ఘటన కారణంగా:ఆ తరువాత కొంతకాలానికి తన రెండో ప్రియుడి మీద పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు పెట్టి అరెస్ట్ చేయించింది. ఈ ఘటన కారణంగా ఆమె అప్పట్లో అమలాపాల్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్య మరల సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్న ఈ అమ్మడు హిందీలో ఖైదీ రీమేక్ భోళాలో అజయ్ దేవగన్ కి జోడీగా నటించింది. ఈ మూవీ ఆశించిన సక్సెస్ అందుకోలేదు.

ఇంటర్నేషనల్ మూవీగా..:ఇక తాజాగా మలయాళంలో పృద్వీరాజ్ సుకుమారన్ కి జోడీగా ఆడుజీవితం అనే మూవీలో నటించింది. ఇండియా నుంచి వస్తున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళంతో పాటు ఇంగ్లీష్ లో కూడా దీనిని తీసారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అందులో పృధ్వీరాజ్ తో అమలపాల్ ఊహించని విదంగా దర్శనమిచ్చింది.

Heroine Amala Paul latest lip lock scene viral in social media

ఘాటైన లిప్ లాక్:ఏకంగా ఇంటిమేట్ కిస్సింగ్ సన్నివేశాలలో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమె కొన్ని సీన్స్ లో శరీరం మీద బట్టలు లేనట్లుగా కనిపించినట్లు తెలుస్తోంది. ఇక ఘాటైన లిప్ లాక్ సీన్ లో అమ్మడు మరోసారి షాక్ ఇచ్చింది. ఈ స్థాయిలో బోల్డ్ పెర్ఫార్మెన్స్ చేసిన ఆడు జీవితం మూవీ అమలాపాల్ కి ఏ మేరకు సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X