Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ముద్దు పెట్టమంటే ఆ హీరో ఏకంగా!! రగిలిపోయిన హీరోయిన్.. తట్టుకోలేక ఉన్నపలంగా..
నేటితరం సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. బాలీవుడ్ మొదలుకొని అన్ని భాషా చిత్రాల్లో లిప్‌లాక్ సీన్స్ హంగామా శృతిమించి పోతోంది. మరీ ముఖ్యంగా చిన్న సినిమాల్లో వీటికే పెద్ద పీట వేస్తూ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఇలాంటి సీన్ తెరకెక్కించేటపుడు ఓ హీరో చేసిన పని హీరోయిన్‌ని చాలా ఇబ్బంది పెట్టేసిందట. దీంతో వెంటనే సదరు హీరోయిన్ సెట్స్ నుంచి పారిపోయిందట. ఆ వివరాలేంటో చూద్దామా..

ముద్దులు పెట్టేందుకు రెడీ.. డిమాండ్ పెరగడంతో అంతా
సినిమా అన్నాక అన్నిరకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సీన్లు అన్నీ కూడా సినిమాలో భాగమే. ముఖ్యంగా ఈ రోజుల్లో రొమాంటిక్ సన్నివేశాలకే డిమాండ్ పెరగడంతో స్టార్ హీరోలు సైతం అలాంటి సీన్స్ చేసేందుకు వెనకాడటం లేదు. కథ డిమాండ్ చేస్తే ముద్దులు పెట్టేందుకు రెడీ అంటున్నారు.

హీరో ముద్దు ధాటి.. పారిపోయిన హీరోయిన్
ఈ నేపథ్యంలోనే తమిళ సినిమా ఉట్రాన్ సెట్స్‌పై ఓ ఆసక్తికర సంఘటన చోటుచేయుకుంది. సినిమా కోసం ముద్దు సీన్ తెరకెక్కిస్తుండగా ఆ హీరో పెట్టిన ముద్దు ధాటికి హీరోయిన్ తట్టుకోలేకపోయిందట. వెంటనే రగిలిపోయి సెట్స్ వదలి పారిపోయిందట. ప్రస్తుతం ఈ ఇష్యూ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

చర్చల్లో లిప్‌లాక్ సన్నివేశం
సాట్ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఉట్రాన్ చిత్రం జనవరి 31వ తేదీన విడుదల కానుంది. రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హిరోషిణి హీరోయిన్‌గా నటించింది. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయిన హిరోషిణి ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. రాజా గజనీ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఓ లిప్‌లాక్ సన్నివేశం ఉంది. ఈ సన్నివేశమే ప్రస్తుతం పలు చర్చలకు దారితీసింది.

హీరో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి అలా..
ఈ ముద్దు సన్నివేశంలో హీరో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి స్మూచ్ సీన్ చేసాడని, దాంతో హీరోయిన్ ఆ దర్శకుడిపై కోపంతో విరుచుకుపడిందని సమాచారం. అయితే ఆ సినిమా కథ చెప్పేటప్పుడే లిప్‌లాక్ సీన్ గురించి తనకు దర్శకుడు చెప్పాడని, అయితే షూటింగ్‌లో మాత్రం అది మరీ అంత ఘాటుగా ఉంటుందని మాత్రం ఊహించలేదని అంటోంది హీరోషిణి. లిప్‌లాక్ అంటే పెదాలపై పెదాలు ఆనించడమని, స్మూచ్ అంటే పెదాలను దాటి నాలుకను చప్పరించడం అని చెబుతోంది సదరు హీరోయిన్.

ఉన్నపలంగా ప్యాకప్
ఈ ఉదంతంతో ఆ చిత్ర దర్శకుడిపై కూడా హీరోయిన్ ఓ రేంజ్‌లో మండిపడిందని తెలుస్తోంది. ఆ వెంటనే ఉన్నపలంగా షూటింగ్ నుంచి ప్యాకప్ చెప్పి ఆమె వెళ్లిపోయిందని సమాచారం. తమిళ సినిమా కావడంతో ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు హీరోయిన్ చేసిన రచ్చతో ఈ సినిమా పేరు బాగానే వినిపిస్తుంది.