twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందంగా కనిపించడం కోసం కెమెరామెన్లతో లింకు.. మా పని మేం చేసుకుంటాం.. హీరోయిన్ కామెంట్స్!

    |

    హీరోయిన్ నిక్కీ గల్రాని నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆశించిన స్థానిలో నిక్కీ గల్రాని విజయాలు దక్కడం లేదు. నిక్కీ గల్రాని 2014లో 1983 అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించింది. నిక్కీ గల్రాని నటించిన ఏకైక తెలుగు చిత్రం కృష్ణాష్టమి. సునీల్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నిక్కీ గల్రానికి నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం నిక్కీ గల్రాని నటిస్తున్నతమిళ చిత్రం కీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సంధర్భంగా నిక్కీ గల్రాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్లు కెమెరామెన్లతో లింకులు పెట్టుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

    హ్యాకింగ్ నేపథ్యంలో

    హ్యాకింగ్ నేపథ్యంలో

    హీరో జీవ, నిక్కీ గల్రాని జంటగా నటిస్తున్న చిత్రం కీ. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కలీస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆధునిక యుగంలో సెల్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. మన వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని మొబైల్స్ లోనే దాచుకుంటున్నాం. ఇదే అదునుగా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. హ్యాకింగ్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం, ఆపై బెదిరింపులకు దిగే సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కీ చిత్రం ఉంటుందని నిక్కీ గల్రాని చెబుతోంది.

    అతడితో తొలిసారి

    అతడితో తొలిసారి

    నిక్కీ గల్రాని మాట్లాడుతూ తాను జీవాతో కలసి నటించిన తొలి చిత్రం కీ అని తెలిపింది. కలగలప్పు 2లో కూడా కలసి నటించాం. ఆ చిత్రమే ముందుగా విడుదలయ్యింది. జీవా సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడు. ఒకరిపై ఒకరం జోకులు వేసుకుంటుంటాం. మా మధ్య అంత మంచి రిలేషన్ ఏర్పడిందని నిక్కీ గల్రాని తెలిపింది.

    అందంగా కనిపించడం కోసం

    అందంగా కనిపించడం కోసం

    అందంగా కనిపించడం కోసం హీరోయిన్లు కెమెరామెన్ల వద్ద కాంప్రమైజ్ అవుతారు, వారితో లింకులు పెట్టుకుంటారు అనే వార్తలపై నిక్కీ స్పందించింది. అలాంటి రూమర్స్ నిక్కీ గాల్రానిపై కూడా వచ్చాయి. హీరోయిన్లు వెండి తెరపై అందంగా కనిపించడంలో కెమెరామెన్ల పాత్ర చాలా కీలకం. కెమెరామెన్లతో నాకు ఎలాంటి లింకు లేదు. సినిమా బాగా రావాలంటే వారి పని వారు చేయాలి. మా పని మేము చేయాలి. అవసరమైనప్పుడు ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించాలి. ఇందంతా వృత్తిలో భాగమే. అంతకు మించి కెమెరామెన్లతో ఎలాంటి సంబంధం ఉండదని నిక్కీ తెలిపింది.

     కీ మాత్రమే

    కీ మాత్రమే

    ప్రస్తుతం నిక్కీ గల్రాని చేతిలో ఉన్న చిత్రం కీ మాత్రమే. నిక్కీ గల్రాని ఈ చిత్రం ఏ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తుందో చూడాలి. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న కీ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతోంది. తాను అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే చిత్రాలనే ఎంచుకుంటానని నిక్కీ తెలిపింది. నా పాత్రకు ఉన్న ప్రాముఖ్యత, కథలో ఉన్న బలం ఆధారంగానే చిత్రాలని ఎంపిక చేసుకుంటానని నిక్కీ గల్రాని తెలిపింది.

    English summary
    Heroine NIkki Galrani responds on link up rumours with cinematographer. Jiiva, Nikki Galrani's Kee movie will going to release on April 12th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X