"వీలైనంత వీపు" సుందరి: అందాల సదా టార్చ్‌లైట్ ఫస్ట్‌లుక్
"టార్చ్‌లైట్" అనేతమిళ చిత్రంలో సదా హీరోయిన్‌గా నటిస్తోంది. తెల్ల చీర మీద ఎరుపు రంగు డీప్ నెక్ బ్లౌజ్‌తో వెనక్కి తిరిగిన సదా "టార్చ్‌లైట్" ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.
హీరోయిన్ సదా పేరు చెప్పగానే "జయం"లో వెళ్లవయ్యా.. వెళ్లూ అంటూ చేయి ముందుకు చాపి ఆమె పలికిన డైలాగులే గుర్తుకొస్తాయి. గత కొంతకాలంగా తెలుగులో హవా తగ్గిన సదా ఆ మధ్య బుల్లితెర వైపు కూడా అడుగులు వేశారు. కోలీవుడ్‌లో శంకర్ దర్శకత్వంలో నటించిన "అన్నియన్" (అపరిచితుడు ) తో పాటు మరికొన్ని హిట్ చిత్రాలూ సదా ఖాతాలో ఉన్నాయి.

తమిళ సినిమాపైనే దృష్టి
ప్రారంభంలో మూడేళ్లపాటు దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్నా, ఆ తరువాత అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళ సినిమాపైనే దృష్టి పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం మజీద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టార్చ్‌లైట్' చిత్రంలో సదా హీరోయిన్‌గా నటిస్తోంది.

వేశ్యగా పాత్ర
గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కుటుంబ పరిస్థితుల కారణంగా వేశ్యగా మారే పాత్రను సదా పోషిస్తోంది. ఈ పాత్ర తన కెరీర్‌ని మలుపు తిప్పుతుందని, మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతాయని సదా ఆశిస్తోంది. అంతేకాదు, ‘టార్చ్‌లైట్'లో సదా నటనకు అవార్డులు కూడా వస్తాయని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

టార్చిలైట్
అందుకే ఇప్పుడు ఆమె తమిళంలోనే ఎక్కువగా ప్రయత్నిస్తోంది. తెలుగులో పెద్దగా అవకాశాల్లేకపోవటం తో ఒక టీవీ చానెల్ నిర్వహించే డాన్స్ షోకి జడ్జ్ గా కూడా వ్యవహరించింది. తాజాగా అక్కడ ‘టార్చిలైట్' అనే సినిమాలో బుక్ అయిన సదా.. ఎవరూ ఊహించని పాత్రలో కనిపించనుంది.

బాలీవుడ్
నిజానికి ఈ తరహా సినిమాలు చేయడంలో బాలీవుడ్ హీరోయిన్లు ముందుంటారు. స్టార్ హీరోయిన్లు సైతం ఆ తరహా పాత్రల్లో కనిపించడానికి ఉత్సాహం చూపుతారు కూడా.! తెలుగులోనూ అనుష్క, శ్రియ ఆ తరహా పాత్రల్లో కన్పించిన విషయం విదితమే. ఇప్పుడు సదా, 'ఆ టైపు' పాత్రలో రెచ్చిపోనుందన్నమాట. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. అప్పటికీ ఇప్పటికీ సదా గ్లామర్ కొలతల పరంగా ఏమాత్రం తేడా రాలేదని ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది

షూటింగ్ చివరి దశలో
ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రొటీన్ జీవితంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో సాగే కథ ఇది. మరీ ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించే మహిళలు ఎలాంటి తిప్పలు పడుతున్నారో చెప్పే సినిమా. తెల్ల చీర మీద ఎరుపు రంగు డీప్ నెక్ బ్లౌజ్‌తో వెనక్కి తిరిగిన సదా ‘టార్చ్‌లైట్' ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అబ్దుల్ మజీద్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











