హీరోయిన్ సిమ్రాన్‌ను ఇబ్బంది పెడుతున్న బిగ్ స్టార్? ఆ హీరో ఎవరంటే?
దక్షిణాది సినిమా దగ్గర ఉన్నటువంటి సీనియర్ స్టార్ హీరోస్ ఇప్పటికీ చాలా మంది హీరోలుగానే కొనసాగుతున్నారు కానీ వారితో వారి టైం నుంచి ఉన్న సీనియర్ హీరోయిన్స్ మాత్రం కేవలం చిన్న చిన్న పాత్రలకి మాత్రం పరిమితం అవ్వడమో లేక సినిమాలకి దూరంగా ఉండడమో చేస్తున్నారు. కాగా ఒకపుడు మన స్టార్స్ సరసన తమ అంద చందాలతో విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్స్ లో నటి సిమ్రాన్ కూడా ఒకరు.
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలయ్య, హరికృష్ణ ఇలా చాలామంది సీనియర్స్ తెలుగు స్టార్స్ సరసన సిమ్రాన్ నటించిన సంగతి తెలిసిందే. అలాగే తమిళ్ లో కూడా ఎంతోమంది స్టార్స్ సరసన ఈమె నటించింది. అయితే ఇప్పుడు ఆ అందరూ హీరోలుగా నిర్మాతలుగా బాగానే ఉన్నారు కానీ సిమ్రాన్ చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసుకుంటుంది.

అయితే ఈమె నిర్మాతగా మారుదాం అని ఓ డెసిషన్ తీసుకుంటే ఆమెకి ఓ స్టార్ హీరో అది కూడా ఆమె నటించిన ఓ హీరోనే ఆమెకి అడ్డు పడ్డాడని తమిళ సినిమా వర్గాల్లో వార్తలు సంచలనంగా వినిపిస్తున్నాయి. కాగా సిమ్రాన్ రీసెంట్ గా పెట్టిన పోస్ట్ ఒకటి చర్చకు దారి తీసింది. "కొందరు వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే మీ స్నేహితులే మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తారు కానీ ఇది బాధాకరం.
నాపై పలు వార్తలు నాకు సంబంధం లేకపోయినా కూడా ప్రచురిస్తున్నారు. నేను ఏ స్టార్ హీరోతో కూడా కావాలని వర్క్ చెయ్యాలని చూడలేదు. ఇప్పుడు ఆ హీరో ప్రయాణం వేరుగా ఉంది నా ప్రయాణం వేరుగా ఉంది. ఒక మహిళగా నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. ఇన్నాళ్లు నాపై పలు వార్తలు వినిపించినప్పటికీ నేను మౌనంగానే ఉన్నాను కానీ ఇప్పుడు చాలు 'ఆపండి'.

ఈ పుకార్లపై ఎవరూ స్పందించలేదు. నా గోడు పట్టించుకోలేదు. నాపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారు నాకు క్షమాపణ చెప్పి తీరాలి అంటూ సిమ్రాన్ ఫైర్ అయ్యారు. అయితే సడెన్ గా సిమ్రాన్ ఇలా స్పందించడం వెనుక అసలు కారణం ఏంటి అనేది కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు సిమ్రాన్ ఒక నిర్మాతగా మారేందుకు ట్రై చేస్తుందట.
ఒక కొత్త బ్యానర్ పెట్టి అందులో స్టార్ హీరో విజయ్ దళపతితో సినిమా చేయాలని విజయ్ ని ఒప్పించే ప్రయత్నం చేసిందట. కానీ అందుకు విజయ్ ఒప్పుకోలేదని వారి కాంబినేషన్ లో సినిమా వద్దు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అన్న తరహాలో కారణాలు చెప్పి సిమ్రాన్ తో సినిమాని రిజెక్ట్ చేసాడట. దీనితో సిమ్రాన్ హర్ట్ అయ్యింది అంటూ పలు వార్తలు తమిళ సినిమా వర్గాలలో వైరల్ గా మారాయి.
కాగా దీనిపైనే సిమ్రాన్ ఈ పోస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి సిమ్రాన్ విజయ్ కాంబినేషన్ లో పలు చిత్రాలు హీరో హీరోయిన్స్ గా వచ్చినవి ఉన్నాయి అందులో భారీ హిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నిర్మాతగా సినిమా చేయడానికి విజయ్ ఒప్పుకోలేదు అంటూ వచ్చిన వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని ఆమె పోస్ట్ తో క్లియర్ అయ్యింది. కానీ మరోపక్క విజయ్ తో సినిమా చేయాలని ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ఒత్తిళ్లు కూడా సిమ్రాన్ పై ఉన్నాయని అందుకే సినిమా ఆపుకుంది అని మరో టాక్ కూడా ఉంది. ఇలా మొత్తంగా అయితే వీరి కాంబినేషన్ మరోసారి సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











