Suchi Leaks ప్రైవేట్ పార్టీ ఫోటోలు లీక్ చేసింది అందుకేనా? సుచిత్ర కామెంట్స్ పై త్రిష సెటైర్

తాజాగా మరోసారి సుచీ లీక్స్ వివాదం తెరపైకి వచ్చింది. స్టార్ సింగర్ సుచిత్ర మళ్ళీ గతంలో చేసినట్టుగానే ధనుష్, త్రిష లాంటి స్టార్స్ పై సంచలన కామెంట్స్ చేస్తోంది. ఇప్పుడు మరోసారి ఆమె చేసిన కామెంట్స్ పై త్రిష ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సుచిత్రకు త్రిష ఇచ్చిన సమాధానం ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచిత్ర అప్పట్లో తనను సుచీ లీక్స్ ఇష్యూలో అనవసరంగా ఇరికించారని వెల్లడించింది. దానికి ప్రధాన కారణం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తన మాజీ భర్త కార్తీక్ అని వెల్లడించింది.

Heroine Trisha Krishnan reacts to singer Suchitra s controversial Suchi Leaks

ఇద్దరూ ప్రాంక్ చేద్దామనుకున్నారని, అలా చేయడానికి ధనుష్ కి ట్విట్టర్ ఖాతా అవసరం కావడంతో కార్తీక్ తన అకౌంటును ధనుష్ కి ఇచ్చాడని వివరించింది. ఆ తర్వాత తన ట్విట్టర్ ఖాతాను ఉపయోగించి ఆ రచ్చ అంతా క్రియేట్ చేశారని చెప్పుకొచ్చింది.

అయితే ఈ ప్రాంక్ లో త్రిష హస్తం కూడా ఉందని వెల్లడించింది సుచిత్ర. త్రిష స్వయంగా తన వ్యక్తిగత ఫోటోను వాళ్లకు అందించిందని, అందుకే ఆమె గురించి ఆ ఒక్క ట్వీట్ మాత్రమే వచ్చిందని, అయినప్పటికీ ఎలాంటి ఎఫెక్ట్ పడలేదని చెప్పుకొచ్చింది సింగర్ సుచిత్ర.ఇక ఈ కేసులో తన పేరును తప్పుగా ఉపయోగించడమే కాకుండా తాను మానసికంగా అస్థిరంగా ఉన్నానని ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఊహించని పరిణామానికి చాలా రోజులు ఆలోచిస్తూ గుడిలో కూర్చుని ఏడ్చేదాన్ని అని, కానీ ప్రతి దానికి దేవుడున్నాడు అనే ధైర్యంతో తనకు తాను నచ్చజెప్పుకున్నానని అప్పట్లో జరిగిన సంఘటనను చెప్పుకొచ్చింది.

Heroine Trisha Krishnan reacts to singer Suchitra s controversial Suchi Leaks

ఇక ఇదంతా జరిగాక తనకు భారత్ లో ఉండడం ఇష్టం లేక లండన్ వెళ్లిపోయినట్టు ఈ సందర్భంగా సింగర్ సుచిత్ర వెల్లడించింది. అయితే స్వయంగా త్రిష తన ఫోటోలు లీక్ చేసింది అంటూ సింగర్ సుచిత్ర చేసిన కామెంట్ పై త్రిష స్పందించింది. కానీ ఆమె డైరెక్ట్ గా సమాధానం ఇవ్వకుండా సెటైరికల్ గా, సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ పోస్ట్ చేసింది.త్రిష తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో నేను నా కళ్ళద్దాలు తీసేయగానే జనాలు ఇవి ఎన్ని వేళ్ళు ? అని అడుగుతారు. బ్రో నేను చూసేది ఇదే అంటూ ఓ ఇమేజ్ ను షేర్ చేసింది. ఆమె ఎక్కడా సింగర్ సుచిత్ర పేరును మెన్షన్ చేయనప్పటికీ, త్రిష సుచిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసిందని అంటున్నారు. మెంటల్ గా ఆమె పరిస్థితి సరిగ్గా లేదని ఈ పోస్ట్ ద్వారా త్రిష వెక్కిరించింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా 2016లో గాయని సుచిత్ర సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలు హీరోయిన్ల సన్నిహిత ఫోటోలను సూచి లీక్స్ పేరుతో సోషల్ మీడియాలో లీక్ చేసింది. అందులో ఆండ్రియా, త్రిష, నిక్కీ గల్రాని, ధనుష్ తదితరులు ఉండగా, ఆ ప్రైవేట్ ఫోటోలో అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత సుచిత్ర డ్రగ్ అడిక్ట్, మెంటల్ గా స్టేబుల్ గా లేదు అంటూ ఈ విషయాన్ని కవర్ చేసారు. ఇన్నేళ్ల తర్వాత సుచిత్ర మళ్లీ తన ఇంటర్వ్యూల ద్వారా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X