శింబుతో పెళ్లిపై పరోక్షంగా కుండబద్దలు కొట్టేసిన త్రిష.. అలా జరగకపోతే ఒంటరి జీవితమే..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా వారంతా త్రిషకు జూనియర్స్ అనే చెప్పాలి. రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటున్న ఈ బ్యూటీ వయసు పెరుగుతున్న కొద్దీ తన అందాన్ని కూడా పెంచుకుంటోంది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయిలానే దర్శనమిస్తోంది. ఇక ఈ బ్యూటీ పెళ్లిపై రోజుకో రూమర్ వైరల్ అవుతుండగా ఇటీవల కుండ బద్దలు కొట్టేసింది.

ఆ హీరోలతో డేటింగ్ రూమర్స్

ఆ హీరోలతో డేటింగ్ రూమర్స్

త్రిష కృష్ణన్ పెళ్లిపై రూమర్స్ రావడం ఇప్పుడు కొత్తేమి కాదు. గతంలో చాలా సార్లు అనేక రకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరోతో రెండేళ్ల వరకు డేటింగ్ చేసిన త్రిష సడన్ గా బ్రేకప్ చెప్పినట్లు కూడా అప్పట్లో ఒక వార్తా వైరల్ అయ్యింది. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న ఒక స్టార్ తో కూడా అప్పట్లో త్రిష డేటింగ్ చేసినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక వాటిని అమ్మడు ఎక్కువగా పట్టించుకోలేదు.

2015లో నిర్మాతతో పెళ్లి క్యాన్సిల్..

2015లో నిర్మాతతో పెళ్లి క్యాన్సిల్..

ఇక 2015లో తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం కూడా గ్రాండ్ గానే చేసుకున్నారు. కానీ అమ్మడి బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లలేకపోయింది. మనస్పర్థల కారణంగానే త్రిష అతనితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్ అయితే గట్టిగానే వచ్చింది.

శింబుతో పెళ్లి ఫిక్స్ అన్నారు..

శింబుతో పెళ్లి ఫిక్స్ అన్నారు..

ఇక దాదాపు ఐదేళ్ల అనంతరం మళ్ళీ త్రిష పెళ్లి టాపిక్ అటు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. హీరో శింబుతో ఆమె పెళ్లి దాదాపు ఖరారైందని పెద్దలు అనుమతించపోయినా కూడా పెళ్లికి సిద్ధమయ్యారని రూమర్స్ వచ్చాయి. ఇక అందరూ నిజమని అనుకుంటున్న తరుణంలో త్రిష ఇచ్చిన వివరణ షాక్ కి గురి చేస్తోంది.

కుండబద్దలు కొట్టిన త్రిష

కుండబద్దలు కొట్టిన త్రిష

త్రిష, శింబులపై రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా మొన్నటివరకు ఎవరు చప్పుడు చేయలేదు. ఇక ఫైనల్ గా త్రిష ఆ మ్యాటర్ ఎత్తకుండానే రూమర్స్ కి ఛెక్ పెట్టి పెళ్లిపై కుండ బద్దలు కొట్టినట్లుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. మనసుకు నచ్చినవాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

Recommended Video

#Watch : Hero Simbu New Look In ATMAN Movie
దొరక్కపోతే.. ఒంటరిగానే

దొరక్కపోతే.. ఒంటరిగానే

ఇక అర్థం చేసుకునే పర్సన్ దొరికితే ఒక కొత్త లైఫ్ మొదలవుతుందని అంటూ.. అలాంటి వ్యక్తి గనక దొరక్కపోతే మాత్రం జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతానని త్రిష ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది. 37ఏళ్ళ వయసులో కూడా త్రిష తనదైన శైలిలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూనే ఉంది. ఆమె చెప్పినధాన్ని బట్టి చూస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరి అమ్మడికి నచ్చిన వాడు ఎప్పుడు దొరుకుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X