ప్రభుదేవా నీకు ఐదేళ్ళ జైలు శిక్ష తప్పదు..న్యాయవాది హెచ్చరిక

By Srikanya

నయనతారను వివాహమాడేందుకు సిద్ధమవుతున్న ప్రభుదేవాకు న్యాయ చిక్కులు తప్పేట్టు లేవు. మళ్లీ పెళ్లాడాలనే ఆయన నిర్ణయాన్ని తమిళనాడు రాష్ట్రంలోని మహిళా న్యాయవాదులు తప్పుబడుతున్నారు. ప్రభుదేవా భార్య రమలత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక భార్య ఉండగానే..మరొకరిని వివాహమాడటం చట్టరీత్యా నేరమని..దానికి గాను ఐదేళ్ల శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వారు ప్రభుదేవాను హెచ్చరిస్తున్నారు. ఆయన వెంట నడిస్తే..నయనతారకు కూడా శిక్ష తప్పదని తేల్చి చెబుతున్నారు. ఇక మూడు రోజుల క్రితం తొలిసారిగా ప్రభుదేవా నోరు విప్పి..తానకు నయనతార అంటే ప్రాణమని, ప్రస్తుతం తాను డైరక్ట్ చేస్తున్న ఇచ్ చిత్రం షూటింగ్ పూర్తవగానే తమ వివాహం జరుగుతుందని ప్రకటించారు.

రమలత్‌కు విడాకులు ఇవ్వకుండా నయనతారను వివాహం చేసుకుంటే..చట్టరీత్యా ఆ పెళ్లి చెల్లదని మద్రాస్ హైకోర్టు న్యాయవాది విజయతారణి పేర్కొన్నారు. అలాగే రమలత్‌తో జరిగిన వివాహానికి సంబంధించిన రికార్డులు లేకున్నా, తాళి కట్టడాన్ని నలుగురు చూసినా అది పెళ్లి కిందకే వస్తుందని వివరించారు. అంతేగాక తన పాస్‌పోర్టులోభార్య స్థానంలో రమలత్ పేరును, ఇద్దరు పిల్లల పేర్లను కూడా ప్రభుదేవా నమోదు చేశారన్నారు. ప్రభుదేవా తన భార్య రమలత్ పేరును లతగా మార్చారని, అది గెజిట్‌లో వుందని చెప్పారు. ఇండియాలోని భార్యకు తెలియకుండా అమెరికాలో మరో పెళ్లి చేసుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ప్రభుదేవా ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X