హీరోయిన్ ఓవియా సినిమాపై వివాదం.. రిలీజ్‌పై స్టే విధించిన కోర్టు!

తమిళ బిగ్ బాస్ బ్యూటీ ఓవియా నటించిన '90 ఎంఎల్' మూవీ గతేడాది కోలీవుడ్లో విడుదలైన సమయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో బూతులు, అసభ్యకర సన్నివేశాలు ఉండటంతో మూవీని బ్యాన్ చేయడంతో పాటు ఓవియా, చిత్ర బృందాన్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్స్ తెరపైకి వచ్చాయి.

తాజాగా ఓవియా నటిస్తున్న మరో మూవీపై కూడా వివాదంలో ఇరుక్కుంది. తాజాగా ఈ చిత్రం విడుదల విషయంలో మద్రాస్ హైకోర్ట్ స్టే విధించింది. ఆమె నటిస్తున్న 'కళావాణి 2' అనే చిత్రం విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది.

2010లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కళావాణి చిత్రానికి ఇది సీక్వెల్. ఎ. సర్కునమ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతోంది. రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో విమల్ హీరోగా నటిస్తున్నాడు.

High court stay on Oviyas next movie Kalavani 2

శ్రీధనలక్ష్మి ఫిల్మ్స్ తరుపున సుమారన్ 'కళావాణి 2' చిత్రాన్ని నిలిపి వేయాలని కేసు వేయడంతో హైకోర్టు స్టే విధించింది. హీరో విమల్‌తో ఉన్న కొన్ని గొడవల వల్లే ఈ చిత్రాన్ని నిలిపివేయాలని వారు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

తమ సినిమా విడుదలపై స్టే విధించడంపై దర్శకుడు మాట్లాడుతూ.. 'శ్రీ ధనలక్ష్మి ఫిల్మ్స్' సంస్థతో తమ సినిమాకు ఎలాంటి కనెక్షన్ లేదని, హీరో విమల్‌తో ఉన్న కొన్ని సమస్యల కారణంగా వారు ఇదంతా చేస్తున్నారు. ఈ విషయం వెంటనే పరిష్కారం అయి సినిమా విడుదలవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు. కళావాణి 2 చిత్రాన్ని మే 3న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X