For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే మహేశ్, వెంకీ కలిసి నటించలేదు. కొట్టుకొంటారు.. సౌత్ హీరోయిన్లపై హీనా ఖాన్ షాకింగ్ కామెంట్స్

  By Rajababu
  |

  దక్షిణాది సినీ పరిశ్రమ, దర్శకులపై బిగ్‌బాస్ కంటెస్టెంట్, టెలివిజన్ నటి హీనా ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారంగా మారింది. హీరోయిన్ల మనోభావాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై దక్షిణాది తారలు హన్సిక, కుష్భూ తీవ్రంగా స్పందించారు. దక్షిణాది దర్శకులకు లావుగా ఉన్న హీరోయిన్లను బాగా ఇష్టపడుతారు. చీరలో వారి అందాలను తెరకెక్కించాలన్న ఆలోచనతో ఉంటారు అని హీనా ఖాన్ చేసిన వ్యాఖ్యలు చేయడంపై వారు మండిపడ్డారు. ఇంతకీ హీనా ఖాన్ ఏం మాట్లాడిందంటే..

  సౌత్ హీరోయిన్లు లావెక్కి

  సౌత్ హీరోయిన్లు లావెక్కి

  హీరోయిన్లను బరువు పెరిగి లావు కావాలని డిమాండ్ చేస్తారు. అలాగే అక్కడి హీరోయిన్లు లావుగా ఉండి అడ్దదిడ్డంగా డ్యాన్సులు చేస్తారు. వారిని దర్శకులు చీరలో అటు ఇటు ఎగిరిస్తారు. డబ్బు మస్తుగా ఇస్తారు. నాకు రెండు భారీ ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. వాటిని నేను తిరస్కరించాను. కానీ ఒక ఆఫర్‌ను వదులుకోవడం బాధగా ఉంటుంది అని హీనా ఖాన్ చెప్పింది.

  వెంకటేష్‌తో నటించే

  వెంకటేష్‌తో నటించే

  హిందీలో కరిష్మా కపూర్‌తో చేసిన వెంకటేశ్‌తో ఓ చిత్రంలో (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం మల్టీస్టారర్‌గా రూపొందింది. మహేశ్‌బాబు, వెంకటేశ్ కలిసి నటించారు. వారు కలిసి నటించడం 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. మహేశ్‌బాబు సూపర్‌గా ఉంటాడు.

  వెంకటేష్, మహేశ్ ఫ్యాన్స్ కొట్టుకొంటారు

  వెంకటేష్, మహేశ్ ఫ్యాన్స్ కొట్టుకొంటారు

  ఏన్నో ఏళ్లుగా వెంకటేష్, మహేశ్ బాబు నటించకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఎందుకంటే వెంకటేష్, మహేశ్ ఫ్యాన్స్ మధ్య బాగా గొడవలు జరుగుతాయి. మహేశ్ ఫ్యాన్స్‌ను వెంకటేష్ అభిమానులు, వెంకటేష్ అభిమానులను మహేశ్ ఫ్యాన్స్ దాడులు చేసుకొంటారు. కుర్చీలు విసురుకొంటారు. ఆ దాడులు మత ఘర్షణల కంటే ఎక్కువగా ఉంటాయి.

  అందుకే వెంకీ, మహేశ్ కలిసి నటించలేదు

  అందుకే వెంకీ, మహేశ్ కలిసి నటించలేదు

  అందుకోసమే మహేశ్‌బాబు, వెంకటేష్ కలిసి నటించలేదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో 15, 20 ఏళ్ల తర్వాత వాళ్లు కలిసి నటించారు. అలాంటి సినిమాలో నాకు నటించే అవకాశం వచ్చింది. వాళ్లు ముంబై వచ్చి నన్ను కలిశారు. అందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఒక హీరోయిన్‌గా నటించమన్నారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అలాంటి సినిమాను వదులుకోవడం కొంచెం బాధగా అనిపించింది.

  ఉత్తరాది వారికి భాష రాకపోతే

  ఉత్తరాది వారికి భాష రాకపోతే

  ఉత్తరాది హీరోయిన్లకు తమిళ, తెలుగు రాకపోతే నేర్పిస్తారు. అయినా రాకపోతే డైలాగులకు బదులు వన్ టూ త్రీలు చెప్పమంటారు అని హీరోయిన్లను కించపరిచే విధంగా హీనా ఖాన్ మాట్లాడింది.

  హీనాఖాన్‌పై హన్సిక ఫైర్

  హీనాఖాన్ వ్యాఖ్యలపై సినీ తార హన్సిక తీవ్రంగా స్పందించింది. హీనా ఖాన్ అలా ఎలా సౌత్ ఇండస్ట్రీని డీగ్రేడ్ చేసి మాట్లాడుతుంది. ఆమె చెప్పిందంతా ఓ బుల్‌షిట్. దక్షిణాది సినిమా పరిశ్రమ అంటే ఏమిటో ఆమెకు తెలియదు. ఈ పరిశ్రమలో ఉన్నందుకు చాలా గర్వపడుతాను అని హన్సిక ట్వీట్ల వర్షం కురిపించింది.

  హీనాపై మండిపడ్డ కుష్బూ

  హీనాపై మండిపడ్డ కుష్బూ

  హీనా ఖాన్ వ్యాఖ్యలపై ఖుష్బూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హీనాఖాన్, ఇతర బిగ్‌బాస్ సెలబ్రిటీలకు హుందాగా ఎలా ఉండాలో అనే విషయంపై పాఠాలు నేర్పించాలి. అందుకే వారు ఇంకా అక్కడే ఉన్నారు అని కుష్బూ ట్వీట్ చేసింది.

  ఆమె ఓ నాన్సెన్స్

  హీనా ఖాన్ అంతా నాన్సెన్స్ మాట్లాడింది. దక్షిణాది హీరోయిన్లపై చాలా దారుణమైన కామెంట్ చేసింది. నేను చాలా మంది ఉత్తరాది నుంచి వారితో కలిసి పనిచేస్తున్నాను. హీనా ఖాన్ చెత్త మాటలు చూస్తుంటే ఒళ్లు మండుతుంది అని నీరజ కోన మండిపడింది.

  English summary
  Bigg Boss 11 is no doubt a house of controversy. Not just inside the house, the contestants are hitting headlines outside the world as well. Hina Khan has been in limelight since the beginning. The actress has been in news for various issues-be it insulting Pooja or another matter. While other contestants call Salman as sir or bhai, Hina addresses him as Salman! Now, in a video, Hina Khan is seen insulting the South industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X