త్రిష.. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
త్రిష మాట్లాడుతూ... ''నేను నటించే చిత్రాల్లో మద్యం తాగే సన్నివేశాలుంటే అవి తప్పకుండా విజయం సాధిస్తాయని నా స్నేహితులు చెప్పారు. అందుకే ప్రతి చిత్రంలో అలాంటివి ఉండాలని దర్శకులను అడుగుతాను. నా తరవాతి చిత్రాల్లోనూ అవకాశం ఉంటే అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తాను'' అని తెలిపింది. ఆ పార్టీ వారు ఆమెకు క్షమాపణ డిమాండ్ చేస్తూ ఉత్తరం రాసారు. ఇలాంటి సెలబ్రేటీలు చేసే వ్యాఖ్యాలు హిందూ స్త్రీలపై ప్రభావం చూపిస్తాయని, స్త్రీల త్రాగుడుని ఎంకరేజ్ చేస్తున్నట్లు ఉందని వారు నిరసన వ్యక్తం చేసారు.
ఇక త్రిష నేటి తరం యువతులు మద్యం సేవించడం మీద మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే 'ఇలాంటి వివాదాస్పద ప్రశ్నకు సమాధానం చెప్పలేను' అంటూ సమాధానం దాటవేసింది. తెలుగులో ఈ సినిమా 24వ తేదీన విడుదలవుతుంది.
తొలుత నాకు 'వేటాడు వెంటాడు' కథ వినిపించనప్పుడు 'నటించాలా..?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇందులో ఒక సందర్భంలో నాకు నెగటివ్ షేడ్స్ కనిపించాయి. ఆ స్క్రిప్ట్ చూడగానే వెంటనే అంగీకరించాలని అనుకున్నాను. గత చిత్రాలతో పోల్చితే ఇది సవాల్‌తో కూడుకున్నది. విశాల్ సరసన తొలిచిత్రమే కాసులవర్షం కురిపించడం ఆనందంగా ఉంది.
త్రిష ప్రయాణం కూడా సాఫీగా సాగడం లేదు. గతేడాది వచ్చిన 'దమ్ము' ఆమెకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. 'వెంటాడు వేటాడు' విడుదలకు సిద్ధమైంది. 'రమ్'లోనూ నాయికగా నటించింది. దర్శక నిర్మాతలు త్రిష వైపు దృష్టి సారించాలంటే వీటిలో కనీసం ఓ సినిమా అయినా.. ప్రేక్షకులకు చేరువవ్వాలి.


Click it and Unblock the Notifications












