విజయ్ సేతుపతిని ఎన్ని సార్లు తంతే అన్ని 1001లు ఇస్తాం.. హిందూ సంస్థ సంచలన ప్రకటన

ఈ వారం మొదట్లో నటుడు విజయ్ సేతుపతిని తన టీమ్ తో కలిసి బెంగుళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అయ్యింది. విజయ్ సేతుపతిఈ సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేసినా, హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1, 001 బహుమతిని ప్రకటించి కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే

నగదు బహుమతి

హిందు మక్కల్ కట్చి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ (ఇందు మక్కల్ కట్చి అని కూడా పిలుస్తారు) విజయ్ సేతుపతి స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్య మరియు దేశాన్ని అవమానించాడని వీడియో ఒక దానిని పోస్ట్ చేసింది. అలా "తేవర్ అయ్యను అవమానించినందుకుగాను ఎవరైతే నటుడు విజయ్ సేతుపతిని తన్నుతారో, ఒకసారి అతనిని తన్నిన వారికి రూ. 1001 ఇస్తామని ఆ సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ నగదు బహుమతి ప్రకటించారు.

తన్నిన వారికి డబ్బులు

తన్నిన వారికి డబ్బులు

అతను క్షమాపణ చెప్పే వరకు విజయ్ సేతుపతి తన్నిన వారికి డబ్బులు ఇస్తామని అని ఇందు మక్కల్ కట్చి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయబడింది. ఈ విషయం మీద అర్జున్ సంపత్ మాట్లాడుతూ, తాను ఆ స్టేట్‌మెంట్ ఇచ్చానని, అది వైరల్ వీడియోకు సంబంధించినదని అంగీకరించాడు. విజయ్ సేతుపతిని తన్నడానికి ప్రయత్నించిన వ్యక్తి మహా గాంధీతో తాను మాట్లాడానని, సేతుపతి హేళనగా మాట్లాడాడని, అది వాగ్వాదానికి దారితీసిందని అర్జున్ సంపత్ అన్నారు.

వ్యంగ్యంగా

వ్యంగ్యంగా


"విజయ్ సేతుపతికి జాతీయ అవార్డు వచ్చినందుకు మహా గాంధీ శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఇది అస్సలు దేశం కాదు అని అన్నారట. దీంతో మహా గాంధీ అవాక్కయ్యారు, కానీ మీరు దక్షిణాది జిల్లాల నుండి వచ్చారు కాబట్టి ముత్తురామలింగ దేవర్ పూజ( తమిళ యోగి) పసుంపోన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. కానీ విజయ్ సేతుపతి మళ్లీ ప్రపంచంలోని ఏకైక తేవన్ (దేవుడు) జీసస్ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడని అన్నారు.

అవమానించాడు

అవమానించాడు

ఇది వాగ్వాదానికి దారితీసింది. అతను పసుంపోన్ సహా దేశాన్ని అవమానించాడు" అని అర్జున్ సంపత్ అన్నారు. తాను నేరుగా మహా గాంధీతో మాట్లాడానని, ఆపై 'నగదు పురస్కారం' ప్రకటించాలని నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు. మహా గాంధీ అన్నట్టు కాకుండా విజయ్ సేతుపతి ఏమీ మాట్లాడకపోతే, ఈ ఆరోపణలను నటుడు ఎందుకు ఖండించలేదని సంపత్ ప్రశ్నించారు.

Recommended Video

Vijay Sethupathi Apologises To His Fans , Here's Why
 వరుస అవకాశాలతో

వరుస అవకాశాలతో

విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి.. ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారిపోతున్నారు. తమిళ్‌లో హీరోగా కొనసాగుతూనే.. రీసెంట్గా దళపతి విజయ్‌ 'మాస్టర్'‌ సినిమాలో, అలాగే ఉప్పెన సినిమాల్లో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించాడు. ముందే తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్‌ చిత్రలతో పరిచయం అయ్యాడు విజయ్‌ కానీ ఇప్పుడు నేరుగా సినిమాలు చేసి అలరిస్తున్నాడు ఆయన. మరి ఈ వ్యవహారం మీద ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X