తమిళుల మనోభావాలను కించపరుస్తున్న ‘రక్త చరిత్ర’
రామ్ గోపాల్ వర్మ సినిమా రక్త చరిత్రకు టాలీవుడ్ లోనే ఎదురుగాలి వీస్తున్నదనుకుంటే ఇపుడు కోలీవుడ్ లోనూ ఇదే మోస్తరు వ్యతిరేకత కనబడుతోంది. తమిళుల మనోభావాలను రక్త చరిత్ర కించపరుస్తుందని ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ హిందూ మక్కల్ కచ్చి ఆరోపిస్తుంది. కనుక ఈ చిత్రాన్ని తమిళనాడులో ప్రదర్శించడానికి వీల్లేదంటూ రామ్ గోపాల్ వర్మకు హెచ్చరిక పంపింది.
ఇంతకీ తమిళులను రక్త చరిత్ర ఏవిధంగా కించపరుస్తుందీ అని సదరు పార్టీని అడిగితే...పరిటాల రవి పాత్రను పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ శ్రీలంకలో జరిగిన ఐఎఫ్ ఎఫ్ ఐ తోపాటు ఇతర సినిమా షూటింగ్ ల్లో పాల్గొన్నారట. తమిళులకు వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించారు కనుక ఆయన నటించిన రక్త చరిత్ర కూడా తమ రాష్ట్రంలో ప్రదర్శనకు అర్హత లేదని అంటున్నారు.
పైగా శ్రీలంకలో చిత్రించే సినిమాల్లో పాల్గొన్న నటీనటులకు సంబంధించిన సినిమాలను తమిళనాడులో ప్రదర్శించకూడదని కోలీవుడ్ సినిమా పరిశ్రమ ఇప్పటికే ఓ తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో ఒబెరాయ్ నటించిన రక్త చరిత్ర తమిళనాట ప్రదర్శించడానికి తాము ఒప్పుకోమని హిందూ మక్కల్ కచ్చి అంటోంది. మరి వర్మ ఏం చేస్తారో...?


Click it and Unblock the Notifications











