»   » నయనతార పోస్టర్లు తగలబెట్టారు!

నయనతార పోస్టర్లు తగలబెట్టారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కొన్ని సున్నిత మైన విషయాల్లో బావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నయనతార విషయంలో ఇటీవల జరిగిన ఓ విషయం కొంత మంది సాంప్రదాయ వాదుల భావోద్వేగాలు హర్ట్ అయ్యేలా చేసింది. ఇంకేం వెంటనే ఆగ్రహంతో ఊగి పోయారు. తమిళనాడులో పలు చోట్ల నయనతార పోస్టర్లను తగులబెట్టారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నయనతారపై ఈ రేంజిలో కొంత మంది సాంప్రదాయవాదులు, సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఆమెకు సంబంధించి ఓ వీడియో. సదరు వీడియోలో నయనతార రోడ్డు పక్కన మద్యం షాపులో బీరు కొన్నట్లు ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల ఇంటర్నెట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

Hindu Makkal Katchi protest againt Nayanthara

అయితే ఆ తర్వాత అది ఓ సినిమా షూటింగుకు సంబంధించిన వీడియో అని తేలింది. నయనతార నటిస్తున్న తమిళ మూవీ ‘నానుమ్ రౌడీథాన్' కు ఈ వీడియో గొడవ బాగా ప్రచారం కల్పించి పెట్టాయి. అయితే నయనతార ఇలాంటి సీన్లలో నటించడంపై హిందు మక్కల్ కట్చి అనే సంస్థ ఆగ్రహంగా ఉంది. ఈ సీన్ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా, సాంప్రదాయాలు మంటగలిపే విధంగా ఉందని, వెంటనే ఈ సీన్ సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోను రియల్ వీడియోగా, తానే స్వయంగా వెళ్లి బీరు కొన్నట్లు మీడియా ప్రచారం చేయడంపై నయనతార అప్పట్లో మండి పడింది. నేను జనాల్లోకి వెళితే ఇట్టే గుర్తు పట్టేసారు. అలాంటపుడు నేను అలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తాను. సినిమా షూటింగ్ సమయంలో ఎవరో సెల్ ఫోన్లో తీసారు. అయినా నేను వెళ్లి బీరు కొన్నానంటే ఎలా నమ్ముతారు...ఈ వీడియోపై ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు అంటూ నయనతార ఫైర్ అయింది. ప్రస్తుతం యూట్యూబు నుండి ఆ వీడియో తొలగించారు.

English summary
Nayanthara buying beer from a TASMAC shop. Now the video has gone viral that Hindu Makkal Katchi condemned Nayanthara for acting in a beer buying scene which provokes women to buy and consume booze. The political party has asked both the director and makers to remove the particular scene or they will be protesting against the movie say a statement issued by them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu