20న రజనీకాంత్‌ కార్యాలయం ముట్టడి

By Srikanya

చెన్నై : ఈ నెల 20న ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు హిందూ మక్కల్‌ కట్చి ఓ ప్రకటనలో తెలిపింది. ఈలం తమిళులకు మద్దతుగా శ్రీలంక తీరును ఆయన కూడా ఖండించాలని డిమాండ్‌ చేసింది. ఐరాసలో అమెరికా ప్రవేశపెట్టనున్న శ్రీలంక వ్యతిరేక తీర్మానానికి భారత్‌ మద్దతు ఇవ్వాలని రజనీకాంత్‌ కూడా ప్రకటన చేయాలంటూ 20న ఉదయం పది గంటలకు కోడంబాక్కం రాఘవేంద్ర కల్యాణ మంటపంలోని ఆయన కార్యాలయాన్ని ముట్టడించనున్నామని తెలిపింది. పార్టీ దక్షిణ చెన్నై అధ్యక్షుడు మణి నేతృత్వం వహిస్తారని వెల్లడించింది.

రజనీకాంత్ ప్రస్తుతం తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఎడిటెడ్ కాపీ సిద్ధమైంది. రజనీకాంత్ తో పాటు ఈ సినిమా టీం కలిసి ఇటీవల దీన్ని వీక్షించారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ఒక అఫీషియల్ స్టేట్ మెంట్ ద్వారా వెల్లడించింది.

ఈ సినిమా గురించి తమిళ డైరెక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ...ఫిల్మ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ముందుగా ఊహించినట్లే సినిమా ఎంతో గొప్పగా వచ్చినట్లు వెల్లడించారు. రజనీకాంత్ తో పాటు దర్శకురాలు సౌందర్యరజనీకాంత్, సినిమా యూనిట్ సభ్యులు సినిమా ఫస్ట్ కాపీపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారు.

కొచ్చాడయాన్ సినిమా ఆసియాలోనే తొలి మోషన్ క్యాప్చర్ సినిమా. గతంలో ఈ టెక్నాలజీ హాలీవుడ్ సినిమాలు అవతార్, టిన్ టిన్ చిత్రాల్లో మాత్రమే ఉపయోగించారు. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు లండన్ లోని పీనివుడ్స్ స్టూడియోలో జరుగుతున్నాయి. మరో 25 రోజుల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రఖ్యాత మ్యూజీషియన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రం 'విక్రమ సింహా' పేరుతో విడుదలకానుంది.

''నా సినీ జీవితంలో ఇదో గొప్ప చిత్రమవుతుంది. మరో మైలురాయిగా నిలుస్తుంది''అన్నారు రజనీకాంత్. రజనీకాంత్‌ నటించిన యానిమేషన్‌ చిత్రం 'కోచ్చడయాన్‌' వేసవిలో తెరపైకి రాబోతోంది. ఈ సినిమా తెలుగులోకి 'విక్రమసింహ' పేరుతో అనువాదమవుతోంది. ఈ క్రమంలో చిత్రాన్ని రజనీకాంత్‌ చెన్నైలో తిలకించారు. ఈ సందర్భంగా రజనీ ఇలా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X