ఆ హీరోయిన్ తో చేయద్దంటూ గౌతం మీనన్ కి వార్నింగ్
ఏమి మాయ చేసావే చిత్రంతో తెలుగువారికి దగ్గరైన దర్శకుడు గౌతం మీనన్. ఆయనికి రీసెంట్ గా హిందూ పీపుల్ పార్టీ వారు వార్నింగ్ ఇచ్చారు. చెన్నైలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు కారణం ఆయన తన తదుపరి చిత్రం కోసం బుక్ చేసుకున్న హీరోయిన్ దివ్య స్పందన. ఆమె గతంలో కళ్యాణ్ రామ్..అభిమన్యు చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అలాగే గౌతమ్ మీనన్ చిత్రం సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో కూడా హీరో సూర్య సరసన చేసింది. ఇంతకీ వారు వార్నింగ్ ఇచ్చింది ఏమిటంటే..వెంటనే ఆమెను చిత్రంలోంచి తొలిగించమని. దానకి కారణం మరేదో కాదు కావేరీ వివాదం. ఈ వివాదం చెలరేగినప్పుడు ఆమె కాస్త తొందరపడి తన స్వరాష్ట్రమైన కర్ణాటకను సపోర్టు చేస్తూ మాట్లాడింది. దాంతో తమిళ తంబీలకు ఆమెపై కోపం వచ్చింది. దాని ఫలితమే ఆమె తమ తమిళ సినిమాల్లో కనపడకూడదనేది. అదీ సంగతి.
కళ్యాణ్ రామ్ నాగ చైతన్య గౌతమ్ మీనన్ ఏమి మాయ చేసావే కర్ణాటక kalyana ram nagachaitanya gowtham menon em maya chesave karnataka


Click it and Unblock the Notifications