హోమ్లీ హీరోయిన్ న్యూడ్‌గా...
ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ గా, అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన 'సంధ్య' నూడ్ గా నటించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. తమిళంలో దీపన్ దర్శకత్వంలో రూపొందబోతున్న 'మాజై కాలమ్' అనే చిత్రానికి గాను....పాత్ర డిమాండ్ మేరకు ఓ సీన్లో అమ్మడు నూలు పోగు లేకుండా నటించేందుకు ఒప్పుకుందని సమాచారం.
ఈ సినిమా కథ కాలేజ్ ఆప్ ఆర్ట్స్ చుట్టూ తిరుగుతుందని, కథలో భాగంగా చిత్రకారుడు వేసే పేయింటింగ్ కోసం ఆమె న్యూడ్ గా ఫోజు ఇవ్వాల్సి వస్తుందని, అందులో భాగంగానే సంధ్య ను అడగ్గా....ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేదు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెబుతున్నారు. సంధ్య కంటే ముందు పలువురు పెద్ద హీరోయిన్లను సంప్రదించినా వారు న్యూడ్ గా నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఇటీవల ఓ కన్నడ సినిమాలో కూడా పూజా గాంధీ అనే హీరోయిన్ పాత్ర డిమాండ్ మేరకు ఇలాంటి న్యూడ్ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకుని వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలే లేని సంధ్య...మరి ఈ న్యూడ్ ఫీట్ ద్వారా సక్సెస్ బాటలో నడుస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











