మన హాట్ హీరోయిన్స్ కి అక్కడ భలే క్రేజ్...!?
మిరపకాయ్" చిత్రం హిట్ అయినా కానీ ఆ క్రెడిట్ అంతా రవితేజకే వెళ్లిపోయింది. అందులో హీరోయిన్లుగా నటించిన రిచా గంగోపాధ్యాయ, ధీక్షాసేథ్ లని తెలుగు చిత్ర పరిశ్రమ అంతగా పట్టించుకోలేదు. అయితే వీరిద్దరూ తమిళనాట భలే క్రేజ్ సంపాదించుకొంటున్నారు. రిచా, దీక్షాసేథ్ ఇద్దరూ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ హాట్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు..
గ్లామర్ డాల్ రిచాకి శింబు, ధనుష్ చిత్రాల్లో వరుసగా అవకాశాలు రాగా, ధీక్షా సేథ్ కి విక్రమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఇద్దరికీ నటన శూన్యమైనా కానీ తమిళనాట నెలకొన్న హీరోయిన్ల కొరత వీరికి బ్రహ్మాండంగా కలిసొచ్చింది. మరి వీరిద్దరు నటిస్తున్న సినిమాలు హిట్ అయితే కనుక ఇక ఇద్దరితో తమిళ స్టార్ హీరోలంతా క్యూ కట్టేస్తారు..దాంతో వీరికి అక్కడ టాప్ హీరోయిన్లు లిస్ట్ లో చోటు దక్కుతుంది. పనిలో పనిగా మళ్లీ తెలుగులోను కొన్ని చిత్రాల్లో నటించే ఛాన్సెస్ వస్తాయని ఇద్దరు మద్దుగుమ్మలు ఆశపడుతున్నారట.


Click it and Unblock the Notifications











