కిడ్నాప్ కి గురి కాబోయి చివరి క్షణంలో తప్పించుకున్న నమిత
నమితను కిడ్నాప్ చేసేందుకు జరిగిన ప్రయత్నం ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమైంది. ఆమె వీరాభిమాని ఆమెను కిడ్నాప్ చేయబోయి పోలీసులుకు దొరికిపోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ నటుడు ఎస్.ఎస్.రాజేంద్రన్ కు కరూర్ లో ఆదివారం రాత్రి జరిగిన అభినందన సభలో ఛీఫ్ గెస్ట్ గా పాల్గొనేందుకు ఆమె వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తిరుచ్చి ఎయిర్ పోర్టు వెలుపల నిర్వాహకులు పంపే కారు కోసం ఎదురుచూస్తున్న నమిత వద్దకు కారు డ్రైవర్ దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి తనను సన్మాన కార్యక్రమానికి తీసుకెళ్లేందుకు తనను పంపారంటూ పరిచయం చేసుకున్నాడు. వాహనంలో కూర్చోగానే మెరుపువేగంతో దూసుకెళ్లసాగాడు. జరిగింది అర్థం చేసుకున్న అసలు డ్రైవర్ నిర్వాహకులకు సమాచారం అందించాడు. దీంతో తన మేనేజర్ తో కలిసి నమిత ఆ కారెక్కారు. అయితే ఈ విషయాన్ని గమనించిన అసలు డ్రైవర్ సభ నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి ఆ కారును వెంబడించాడు. చివరకు నిర్వాహకులు మార్గమధ్యంలో నకిలీ కారు డ్రైవర్ ను అడ్డుకొని అతన్ని పోలీసులకు అప్పగించారు. అభిమాన నటి కావడంతో ఒక్కసారైనా ఆమెను తన కారులో ఎక్కించుకోవాలనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నిందితుడు పోలీసు విచారణలో పేర్కొన్నాడు. విచారణలో...అతను తిరుచ్చికి చెందిన పెరియస్వామి(26) అని, నమితకు వీరాభిమానిగా తేలింది. ఆమెపై ఉన్న అభిమానంతో ఇంతటి సాహసానికి ఒడిగట్టినట్లు వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











