అమలాపాల్ కు త్రిష అదిరిపోయే ట్విస్ట్
చెన్నై : ఇద్దరమ్మాయిలతో మంచి జోష్ మీద ఉన్న అమలా పాల్ కు త్రిష వైపు నుంచి ట్విస్ట్ ఎదురైంది. సూర్యకు 'కాక్కా కాక్కా', 'సూర్య సన్నాఫ్ ఆఫ్ కృష్ణన్'లాంటి అద్భుత విజయాల్ని అందించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రస్తుతం 'ధ్రువనక్షత్రం' తెరకెక్కించనున్నాడు. నటీనటుల ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో సూర్యకు జంటగా అమలాపాల్ పేరును పరిశీలించారు.
ప్రస్తుత తనస్థాయి ఆధారంగా అవకాశం దక్కుతుందని అమలాపాల్ కూడా ఆశలు పెంచుకుంది. అయితే ఊహించని విధంగా త్రిష పేరు తెరపైకి వచ్చింది. గతంలో 'విన్నైతాండి వరువాయా'(ఏమి మాయ చేసావే ) లో ఆకట్టుకున్న త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. తనకున్న గత పరిచయం ఆధారంగా గౌతమ్ మీనన్ ని ఈ ప్రాజెక్టు ఓకే చేసాలే చేసిందని అంటున్నారు.
ఇక విషయం తెలిసి షాకైన అమలాపాల్ ఎలాగైనా అవకాశాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తుండగా, స్టార్ హీరోలతో నటించి చాలా రోజులైన త్రిష కూడా అదే ప్రయత్నంలో ఉంది. చివరకు సూర్య సరసన ఎవరు ఆడిపాడతారోనని కోలీవుడ్‌వర్గాలు కూడా ఆసక్తిగా గమనించాయి. కానీ గౌతమ్ మీనన్ కు త్రిష వైపే మెగ్గు చూపేలా చేసుకుంది.


Click it and Unblock the Notifications












