అమలాపాల్ సీక్రెట్ మ్యారేజ్ ఇలా బట్టబయలు.. లీక్ చేసింది ఎవరో తెలుసా?
దక్షిణాది తార అమలాపాల్ సీక్రెట్‌గా చేసుకొన్న రెండో పెళ్లి మీడియాలో లీక్ కావడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. కొద్దికాలంగా సింగర్ భవిందర్ సింగ్‌తో చేస్తున్న డేటింగ్ ఇటీవల కాలంలో మీడియాలో ప్రముఖంగా మారింది. అయితే వారిద్దరూ గుట్టుచప్పుడు కాకుండానే అఫైర్ వ్యవహారాన్ని కొనసాగించారు. అయితే మధ్యలో కొన్ని లీకులు ఇస్తూ వారి డేటింగ్ వ్యవహారాన్ని మెల్లగా మీడియాకు ఉప్పందించారనే వార్తలు కూడా వెలుగు చూశాయి. ఇలా లీకుల పర్వం కొనసాగుతుండగానే శుక్రవారం అనూహ్యంగా వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వారు జాగ్రత్త పడినా.. పెళ్లి వ్యవహారం ఎలా లీక్ అయిందంటే..
Recommended Video

హిందూ సంప్రదాయం ప్రకారం
హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిలో అమలాపాల్, భవిందర్ సింగ్ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. అన్యోన్యంగా పెళ్లి మంటపంలో వారిద్దరూ కలిసి ముద్దులు పెట్టుకొన్న ఫొటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తర భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లికి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం.

ప్రైవేట్ కార్యక్రమంగా
పక్కా ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన అమలాపాల్, భవిందర్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఎలా లీకయ్యాయనే ప్రశ్న మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తమ పెళ్లి ఫోటోలను పెళ్లికొడుకు భవిందర్ సింగ్ యాక్సిడెంటల్‌గా సోషల్ మీడియాలో షేర్ చేశారని సన్నిహితులు చెప్పారు. అయితే తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసి వెంటనే డిలీట్ చేయడం గమనార్హం.

భవిందర్ సింగ్ పనేనని..
అయితే భవిందర్ సింగ్ షేర్ చేసిన కొద్ది సేపటికే పలు మీడియా సంస్థ చేతికి ఆ ఫోటోలు లభించడం, వెంటనే అవి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో భవిందర్ సింగ్ చేసిన తప్పును సరిద్దిద్దుకోలేకపోయారని తెలిసింది. మధ్యాహ్నం కల్లా అమలాపాల్ పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడం గమనార్హం.

అమలాపాల్ దంపతులే లీక్ చేశారని
మీడియాకు గానీ, సినీ ప్రముఖులకు గానీ చెప్పకుండా గోప్యంగా జరిగిన పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని కావాలని చేసిన ప్లాన్ ప్రకారమే అమలాపాల్ దంపతులు లీక్ చేశారనే మరో వాదన కూడా వినిపిస్తున్నది. అయితే ఏది ఏమైనా కొద్దికాలంగా డేటింగ్, సహజీవనం వార్తలపై సాగుతున్న దాగుడుమూతలకు పెళ్లి వార్తతో తెరపడిందని సినీ ప్రముఖులు అంటున్నారు.

ఇంకా కన్ఫర్మ్ చేయని అమలాపాల్
ఇదిలా ఉండగా, పెళ్లికి సంబంధించిన వార్తలను అటు అమలాపాల్ గానీ, భవిందర్ సింగ్ గానీ తమ పెళ్లి వార్తను ఇంకా ధృవీకరించకపోవడం గమనార్హం. త్వరలోనే తమ పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశముందని సన్నిహితులు పేర్కొంటున్నారు.

2017 నుంచి డేటింగ్
అమలాపాల్, భవిందర్ సింగ్ 2017 నుంచి డేటింగ్ చేస్తున్నారని, గత కొద్దికాలంగా వారిద్దరూ తమ బంధాన్ని సహజీవనంగా మార్చుకొన్నారని సన్నిహితులు చెప్పుకొచ్చారు. భవిందర్ సింగ్ ముస్లిం మతాన్ని స్వీకరించారని, అమలాపాల్ జన్మత క్రిస్టియన్ కావడం గమనార్హం. ప్రస్తుతం పెళ్లి తర్వాత హిందూ మతం సంప్రదాయాలను ఆచరిస్తారని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











