twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేకలు పెట్టిన త్రిష

    By Staff
    |

    Trisha
    ఆ మధ్య హైదరాబాద్ లో ఓ షూటింగ్ కోసం వచ్చిన త్రిష లో ఓ హోటల్లో ఉండగా హఠాత్తుగా పెద్దగా కేకలు పెట్టింది. దాంతో ఒక్కసారిగా హోటల్ సిబ్బంది ఎలర్టయి ఆమె దగ్గరకు వెళ్ళి విషయం ఏమిటని అడిగారు. దానికామె ఎంతో ఏంగ్జైటైగా టీవీలో న్యూస్ చూపింది. అక్కడ రహమాన్ కి ఆస్కార్ వచ్చిందని వస్తోంది. దాంతో ఆ వచ్చిన మేనేజర్ ఇది పబ్లిక్ ఉండే హోటల్..కాస్త భావోద్వేగాలు కంట్రోల్ లో ఉంచుకోమని చెప్పి వెళ్ళాడట. ఈ విషయం త్రిషే స్వయంగా ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చింది.ఎందుకలా అంటే ఆమె రహమాన్ కి వీరాభిమాని అని స్పష్టం చేసింది. అలాగే త్రిష స్కూల్ డేస్ నుంచి ఆమె రహ్మాన్ ఫాన్ నని చెప్పుకొచ్చింది.

    అంతేగాక ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రంలో వేషం వచ్చినప్పుడు హీరో ఎవరూ, డైరక్టర్ ఏమిటి అన్నది కూడా అడగకుండా సైన్ చేసాను. కారణం రహ్మాన్ సంగీత దర్శకుడు అని ఎగ్రిమెంట్ లో ఉండటమే. ఇప్పటికీ రహమాన్ మ్యూజిక్ డైరక్టర్ అయితే కథ కూడా అడక్కుండా ఒప్పుకుంటానని చెప్పుకొచ్చింది. త్వరలో త్రిష హీరోయిన్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రానున్న చిత్రంలో కూడా రహ్మాన్ సంగీతం ఇవ్వబోతున్నాడు.ఆ ఆడియో పంక్షన్ లో రహమాన్ ప్రక్కన కూర్చునే అవకాశం ఇస్తానని గౌతం మీనన్ ప్రామిస్ చేసాడని ఉత్సాహంగా చెప్తోంది. అదీ త్రిష కేకలు వేసిన విషయం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X