కేవలం వాళ్ళిద్దరికే నేను జవాబుదారి..తమన్నా
తాను జీవితంలో ఇద్దరికి మాత్రమే జవాబుగా ఉంటానని,అంతకు మించి ఎవరకీ ఏ విధమైన సమాధానం చెప్పాల్సిన పనిలేదని తమన్నా తెగేసి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పింది. మిల్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న తమన్నా సమాధానం చెప్తానని కమిట్ అవుతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఆమె తల్లి తండ్రులుట. సర్లే ఇంత ఆవేశంగా ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చిందీ అంటే..ఈ మధ్య ఓ తమిళ చిత్రం ప్రెస్ మీట్ లో ఆమెను తమిళ హీరో కార్తీ గురించి అడిగారు. ఆవారా లో తన సరసన చేసిన కార్తీ గురించి తనకేమీ తెలియదనీ, తమ మధ్య వారంతా అనుకుంటున్నట్లు ఏమీ లేదని, పదే పదే అదే విషయం ప్రస్ధావించ వద్దని చెప్పింది.
అప్పటికీ ఓ మీడియో ప్రతినిధి అత్యుత్సాహంతో అప్పుడు మీ ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయే..దానికి సమాధానం ఇవ్వండీ అంటే...తాను ఇటువంటి విషయాలకు పేరెంట్స్ కు తప్ప మరెవరకీ సమాధానం ఇవ్వనని, ఆ అవసరం లేదని ఖరాఖండిగా చెప్పి నోరు మూయించింది. అలాగే తన జీవితంలో ఏ జరుగుతోందో తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి వారికే ఉండాలని నిక్కచ్చిగా అంది. అయినా అటువంటి రూమర్స్ గురించి తాను పెద్దగా పట్టించుకోనని, తన కెరీర్ లో ఎన్నో లక్ష్యాలు ఉన్నాయని, వాటి గురించి ఆలోచిస్తే మేలని అంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో నాగచైతన్య సరసన సుకుమార్ దర్శకత్వంలోనూ, అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











