తప్పుచేసా, అలాంటి పాత్రలు ఇక ఒప్పుకోను : అమలా పాల్
కెరీర్ ప్రారంభంలో తమిళంలో ఆమె చేసిన 'సింధు సమవెళి'లాంటి పాత్రలో ఇకపై కనిపించనని అమలాపాల్ చెబుతోంది.
'సింధు సమవెళి'లో పోషించిన పాత్ర సంచలనం సృష్టించింది. తన భర్త తండ్రితో వివాహేతర సంబంధం కొనసాగించే మహిళగా కనిపించింది. ఈ పాత్రపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మహిళా సంఘాలు అమలాపాల్ తీరును వ్యతిరేకించాయి.
అమలా పాల్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభం కావటంతో అనుభవరాహిత్యంతో అంగీకరించాను. ఆ పాత్ర పేరు తెచ్చిపెట్టినా అలా కనిపించినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. ఇకపై ఆ తరహా పాత్రల్లో నటించనని తేల్చిచెప్పింది.
చిన్ననటిగా వచ్చి అగ్రస్థానానికి ఎదిగిన అమలాపాల్ ప్రస్తుతం 'ఇలయ తలబది' సరసన 'తలైవా'లో నటిస్తోంది. తెలుగులోనూ మరో రెండు పెద్ద ప్రాజెక్టులు సైన్ చేయబోతోందని వినికిడి. తెలుగులోనూ ఆమె మొదట్లో బెజవాడ వంటి చిత్రాల్లో చేసింది. అవి భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ తో చేసిన నాయక్ ఆమెకు ఇక్కడ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications












