twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పుచేసా, అలాంటి పాత్రలు ఇక ఒప్పుకోను : అమలా పాల్

    By Srikanya
    |

    చెన్నై : ఇద్దరమ్మాయిలతో చిత్రంతో మంచి జోష్ మీద ఉన్న అమలాపాల్ తన కెరీర్ పై ఇప్పుడు పూర్తి స్ధాయి దృష్టి పెట్టింది. తను గతంలో చేసిన తప్పులను ఇకపై చేయకూడదని, తను అనుభవ రాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలు ఇకపై రిపీట్ కానివ్వకూడదని నిర్ణయం తీసుకుంది.

    కెరీర్ ప్రారంభంలో తమిళంలో ఆమె చేసిన 'సింధు సమవెళి'లాంటి పాత్రలో ఇకపై కనిపించనని అమలాపాల్‌ చెబుతోంది.
    'సింధు సమవెళి'లో పోషించిన పాత్ర సంచలనం సృష్టించింది. తన భర్త తండ్రితో వివాహేతర సంబంధం కొనసాగించే మహిళగా కనిపించింది. ఈ పాత్రపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మహిళా సంఘాలు అమలాపాల్‌ తీరును వ్యతిరేకించాయి.

    అమలా పాల్ మాట్లాడుతూ.. కెరీర్‌ ప్రారంభం కావటంతో అనుభవరాహిత్యంతో అంగీకరించాను. ఆ పాత్ర పేరు తెచ్చిపెట్టినా అలా కనిపించినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. ఇకపై ఆ తరహా పాత్రల్లో నటించనని తేల్చిచెప్పింది.

    చిన్ననటిగా వచ్చి అగ్రస్థానానికి ఎదిగిన అమలాపాల్ ప్రస్తుతం 'ఇలయ తలబది' సరసన 'తలైవా'లో నటిస్తోంది. తెలుగులోనూ మరో రెండు పెద్ద ప్రాజెక్టులు సైన్ చేయబోతోందని వినికిడి. తెలుగులోనూ ఆమె మొదట్లో బెజవాడ వంటి చిత్రాల్లో చేసింది. అవి భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ తో చేసిన నాయక్ ఆమెకు ఇక్కడ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది.

    English summary
    
 Amala paul made her debut through the Tamil film Sindhu Samaveli. This film i about illegal relationship between father-in-law and daughter-in-law. Amala Paul while speaking to the media has mentioned that ..I had no expreience when i debuted in films. Without listeninig to the whole story, I acted in the films. Sindhu Samaveli is also one such film. I was ashamed after seeing the comments I Got. Since I had no prior experience, i had acted in that film. In future i will not act such type of roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X