హ్యాపీ గర్ల్ తమన్నా నిజాలు నిక్కచ్చిగా చెప్పేస్తూ అందరినీ ఇరకాటంలో పడేస్తోంది. తాజాగా ఆమె జబ్ వుయ్ మెట్ రీమేక్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేను ఇప్పటికి ఎనిమిది సార్లు ఆ సినిమాను చూసాను.దాంతో కరీనా కపూర్ కి పెద్ద ఫ్యాన్ ని అయిపోయాను. నేను ఈ సినిమాలో చేస్తున్నది కేవలం ఆమె హావభావాలను మక్కికి మక్కీ దించటమే. నిజానికి మొదట నేను చాలా కంగారుపడ్డా. కానీ కాపీ చేస్తుంటేనే బాగుందనిపించింది. ఎందుకంటే ఆ మేనరిజమ్స్, హావభావాలు కూడా సినిమాలో అంతర్భాగం. ఆ హిట్టుకి అవి మేజర్ షేర్ వహించాయి. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో రాజు, రాణి పేరుతో అనువదించనున్నారు. భరత్ ఆమెకు జంటగా చేస్తున్నాడు. ఆనందతాండవం, వీడొక్కడే రెండు ఒకే నెలలో రిలీజ్ కావటంతో ఆమె ఆనందానికి అంతే లేదు. ఇక తమన్నా ఇలా నేను కరీనాను కాపీ కొడతున్నాను అని చెప్పటం ఆ తమిళ రీమేక్ దర్శకుడుకి నచ్చటం లేదు. ఇలా చెప్పటంలో అంతరార్ధం నా క్రియేటివిటి ఏమి లేనట్టేగా అని గొణుక్కుంటున్నాడు.