లిప్ లాక్ కిస్ ఇస్తానని ఎవరు చెప్పారు...తమన్నా

By Srikanya

లిప్ లాక్ కిస్ ఇస్తున్నానని, కోటి పాతిక లక్షలు దాకా రెమ్యునేషన్ తీసుకుంటున్నానని మీకు ఎవరు చెప్పారంటూ తమిళ మీడియాపై తమన్నా మండిపడుతోంది. తాజాగా ఆమె కమట్ అయిన కె.ఎస్.రవికుమార్ చిత్రంలో ఆమె గురించి వచ్చిన రూమర్స్ పై చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఇప్పటికే ధనుష్, సూర్య, కార్తీ, విజయ్ వంటి వంటి వారి సరసన నటించిన ఈ పంజాబి ముద్దు గుమ్మ నటించిన జబ్ వుయ్ మెట్ రీమేక్ ఈ మధ్యే రిలీజ్ అయింది. భరత్ సరసన ఆమె నటించింది. అయితే అంతా కరీనా కపూర్ చేసినట్లు ఆమె అభినయం చూపలేకపోయిందంటూ వచ్చిన రివ్యూలను ఆమె విసుక్కుంటోంది.

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రానున్న కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్టుకి హీరోయిన్ గా తమన్నాని అడిగినట్లు సమాచారం.దాంతో తమన్నాకి కమల్ హాసన్ లిప్ టు లిప్ కిస్ తప్పదంటూ చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. గతంలోనూ కమల్ తనతో చేసిన హీరోయిన్స్ అందరితో ఈ తరహా ముద్దు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తమన్నా తన డేట్స్ ఎడ్జెస్ట్ అవుతాయనో లేదనో చెప్పకుండానే ఈ తరహా రూమర్స్ వినపడటం ఆశ్చర్యపరుస్తోంది.

ఇక కమల్ తన ఎ వెడ్నస్ డే రీమేక్ ఊహించినంతగా క్లిక్ కాకపోవటంతో ఒకింత నిరాశకు గురిఅయ్యాడని తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్టుకు స్క్రిప్టు రెడీ అయిందనీ అది టోటల్ గా కామిడీగా ఉంటుందని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇంతకుముందు కమల్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో దశావతారం వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X