సినిమా రికార్డుల కోసం తానెప్పుడూ వెంపర్లాడను: సూపర్ స్టార్..

By Sindhu

తన సినిమాకి సంబంధించి, వసూళ్ళనూ, రికార్డులనూ తానెప్పుడూ పట్టించుకోనని చెబుతున్నాడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఎన్నాళ్లు సినిమా కెరీర్ లో కొనసాగుతానో ఇప్పుడే చెప్పలేననీ, రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదనీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ చెప్పుకొచ్చాడు. 'రోబో" వసూళ్ళు ఇండియన్ సినిమా స్క్రీన్ పై రికార్డులు సృష్టించాయి కదా..అనడిగితే, 'అవన్నీ నిర్మాతను అడగండి..నా వరకూ నేను మంచి సినిమా చేశానా లేదా..అనే విషయాన్నే ఆలోచిస్తాను" అంటూ హుందాతనాన్నిచాటుకున్నాడు రజనీ.

సినిమా ప్లాపయితే మాత్రం, నష్టపోయిన బయ్యర్లను ఆదుకునేందుకు ప్రయత్నిస్తానంటోన్న రజనీ, సినిమా హిట్టయినా ఫట్టయినా, అదంతా దైవాధీనమని, పని చేయడం వరకే తన బాధ్యత అని స్పష్టం చేశాడు. తెరపై ఎంత మేకప్ వేసుకున్నా, రియల్ లైఫ్ లో మేకప్ లేకుండా వుండడమే తనకు ఇష్టమనీ, అదే ప్రశాంతతనిస్తుందని, వయసు మీదపడ్తోందన్న దిగులు తనకు ఎంతమాత్రం లేదని వేదాంతం చెబుతున్నాడు రజనీ..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X