నయనతార, ప్రభుదేవాలకు మీడియేటర్‌ని కాను
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.. నన్ను ఈ వివాదంలోకి లాగినందుకు.. నేను ఎవరికీ మీడియాటర్ ని కాను.. అవను అంటూ కోపంతో మండిపడింది ఖుష్బూ. త్వరలో పెళ్లిచేసుకోబోయే ప్రేమ జంట నయనతార, ప్రభుదేవా ఏవో విధేదాలతో విడిపోయారంటూ వార్తలు వచ్చిన నేపధ్యంలో ఖుష్బూ వారిని కలుపటానకి ప్రయత్నిస్తోందటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దానిపై తమిళ మీడియా ఆమెను నిలదీసింది.
దాంతో ఆమె - ఇదంతా మీడియా నిర్వాకం. అయినా నయనతార, ప్రభుదేవా ల ప్రెవేట్ వ్యవహారం అది. అసలు వాళ్లిద్దరూ విడిపోయారనే విషయమే నాకు తెలియదు. అలాంటప్పుడు నేను మధ్యలో చేరి మీడియేటింగ్ చేయటమేంటి. అసలు ఎవరు ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారో అర్దం కావటం లేదు అంది. ఇక నయనతార ప్రస్తుతం రానా సరసన కృష్ణం వందే జగద్గురం చిత్రం చేయటానికి హైదరాబాద్ వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటిలో ఆ షూటింగ్ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా నయనతార,ప్రభుదేవా విడిపోయారన్న వార్తలు జోరందుకున్నాయి. గతంలో ఖుష్బూ,ప్రభు ల మధ్య చాలా కాలం జరిగిన సహజీవనం తర్వాత బ్రేక్ అప్ అయ్యి ఆమె వివాహం చేసుకోవటంతో ముగిసింది. దాంతో ఈమెను ఇలా సీన్ లోకి తీసుకువచ్చారని కొందరంటున్నారు.


Click it and Unblock the Notifications











