'బాషా' రీమేక్‌ చేయటం లేదంటూ ఖండన

By Srikanya

తమిళంలో రజనీకాంత్ నటించిన 'బాషా'అప్పట్లో పెద్ద సంచలనం. 'బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే' అని రజనీకాంత్‌ పదిహేడేళ్ల కిందట చెప్పిన డైలాగ్‌ని ఎవరూ మరిచిపోరు కూడా. ఈ నేపద్యంలో ప్రభుదేవా ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ముంబై మీడియా ఈ వార్తలను ప్రచారం చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని,ఈ కాలానికి తగినట్లు ప్రభుదేవా మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు ప్రచారం చేసింది. అయితే ఈ విషయాన్ని ప్రభుదేవా ఖండిస్తున్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''అసలు నాకు 'బాషా' చిత్రాన్ని రీమేక్‌ చేసే ఆలోచనే లేదు. ఎందుకంటే అది ఓ క్లాసిక్‌. అక్షయ్‌తో ఈ యేడాది మరో సినిమా చేస్తాను కానీ... అది వేరే కథ'' అని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా ఈ మధ్యనే హిందీలోకి అనువాదమైంది. అయితే ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని పలువురు దక్షిణాది హీరోలు సైతం ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతూండటంతో ఈ రీమేక్ ని కూడా ప్రభుదేవాని చేస్తాడని రూమర్స్ బయిలు దేరాయి.


ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో 'రౌడీ రాథోర్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం తెలుగులో రాజమౌళి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావటంతో బాలీవుడ్ హీరోల దృష్టి మొత్తం ప్రభుదేవాపై పడింది. అందులోనూ సల్మాన్ ఖాన్ తో పోకిరి రీమేక్ ని వాంటెండ్ పేరుతో తీసి సూపర్ హిట్ చేయటం,ఇప్పుడు దక్షిణాది చిత్రాక కధల హవా నడవటం ఈ ప్రభుదేవాకు కలిసివచ్చింది. సంజయ్ లీలా భన్సాలి వంటి దర్శకుడు సైతం ఈ మాస్ సబ్జెక్టుతో హిట్ ఖాయం అని నమ్మి నిర్మిస్తున్నారు.

పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా కసరత్తులు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X