twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాన్స్ చేయాలని నాక్కూడా వుంది..కానీ ఇప్పుడు కాదు...!

    By Sindhu
    |

    రికార్డ్స్ నెలకొల్పడం కమల్ హసన్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ రికార్డులని బ్రేక్ చేయాలని ప్రతి యంగ్ హీరో కలలు కంటుంటారు. సూర్య ఇప్పుడు ఆపని మీదే ఉన్నాడు. కమల్ దశావతారంలో పది పాత్రలు పోషిస్తే.... గతంలో గజనిగా భిన్నకోణాలు ఆవిష్కరించిన సూర్య ఏకంగా ఇరవై పాత్రలు చేసేందుకు సిద్దమవుతున్నాడు. సూర్య చేసే ఈ చిత్రానికి మాట్రన్ అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

    'సెవెన్త్‌ సెన్స్‌' విజయంతో ఊపుమీదున్న సూర్య ఇప్పుడు కెవి ఆనంద్‌ దర్శకత్వంలో 'మాత్రన్‌' సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇది పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా అంటున్నారు సూర్య. కానీ, సూర్య నుంచి రొమాంటిక్‌ సినిమా రాదా? అని అభిమానులు అడుగుతున్నారు. ఇదే విషయాన్ని సూర్య దృష్టికి తీసుకువస్తే, రొమాన్స్‌ ఇప్పుడు కాదన్నాడు. ''నేను ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోను. అప్పటికెలా జరిగితే అలా చేసుకుంటాను. ప్రస్తుతానికైతే నాక్కూడా రొమాంటిక్‌ సినిమా చేయాలన్న ఆలోచన లేదు. చేయాల్సిన ప్రయోగాలు చాలానే ఉన్నాయి.

    నా అభిమానులకు విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చూపించాలనుకుంటున్నాను. రొమాంటికి సినిమా చెయ్యాల్సి వస్తే అది ఇంతకు ముందొచ్చిన నా రొమాంటిక్‌ సినిమాలకంటే బాగుండాలి" అన్నారు. ఇక సెట్స్‌ పైకి రాబోయే 'మాత్రన్‌' గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నాడు. కానీ, ఈ సినిమా కూడా తనకు ఒక మైలురాయిగా ఉండబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. భారీ తారాగణంతో వైవిధ్యభరితంగా రాబోయే ఈ సినిమాను కేవీ ఆనంద్‌ మంచి లొకేషన్లలో షూట్‌ చేస్తున్నారని సూర్య వెల్లడించాడు.

    English summary
    After 7 Am Arivu, Surya is busy with Maatran. Directed by K V Anand. Kajal Agarwal plays the heroine. Asked about doing action-flicks back-to-back, Surya says, 'I generally don’t plan things. I take what comes my way.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X