తేల్చుకుందా రా: రజనీకాంత్‍పై డైరెక్టర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
హైదరాబాద్: తమిళ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి తెచ్చేందుకు పలు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, దేవుడు నిర్ణయం మేరకు అంతా జరుగుతుందని అన్నారు.
ఒక వేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు భారీ మద్దతు లభించడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆయన్ను రాజకీయాల్లోకి రాకుండా ముందుగానే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన తమిళు కాదు, తమిళుడే ఈ గడ్డను ఏలాలనే వాదన తెరపైకి తెస్తున్నారు.

తమిళ దర్శకుడు, నటుడు అయిన సీమాన్ తాజాగా రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ‘నాన్ తమిళర్ కట్చి' పార్టీలో కొనసాగుతున్న సీమాన్ ఆ పార్టీ సభలో మాట్లాడుతూ తమిళుల కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని, తమిళ జాతి మనుగడ, సంక్షేమం పార్టీ ముఖ్య లక్ష్యం అన్నారు. తమిళ జాతి కోసం ప్రాణాలు అర్పించిన ఎల్టీటీఈ నేత ప్రభాకరణ్ ఆరాధ్యుడు' అని వ్యాఖ్యనించారు.
‘తమిళుడు కాని రజనీకాంత్ లాంటి వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన తన జీవిత కాలంలో తమిళుల కోసం ఏం చేసారని ప్రశ్నించాడు. తమిళుడే ఈ గడ్డను ఏలాలి. ఒక వేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తొలి ప్రత్యర్థి తానే అన్నారు. ‘ఒంటరిగా వస్తావా మద్దతుగా వస్తావా తేల్చుకుందాం రా' అంటూ సీమాన్ సవాల్ విసరడం చర్చనీయాంశం అయింది. సీమాన్ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











