twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజినీ రాక పక్కా అయినట్టే.!? ఉద్వేగ భరితమైన స్పీచ్: నన్ను తరుముతున్నారు అంటూ

    రజినీ కాంత్ రాజకీయ ప్రవేశం ఖరారైనట్టేనా? ఈ రోజు రజినీకాంట్ స్పీచ్ విన్నవాళ్ళందరికీ వచ్చిన అనుమానం ఇదే. రజినీ చేసి అత్యద్బుత ప్రసంగం అందర్నీ ఆలోచనలో పడేసింది.

    |

    తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తమిళుల ఆరాధ్య నటుడు.., భారతీయులందరికీ అభిమాన హీరో, ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు సినిమా పరంగా గుర్తింపు ఉంది. జపాన్, చైనా లో కూడా ఈయన సినిమాలు సూపర్ గా ఆడాయంటే ఏ రేంజ్ లో అక్కడ కూడా పాపులారిటీ సంపాదించాడు.భారత దేశానికి సంబందించినంత వరకూ రజినీ కాంత్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు అతనొక "హీరో". ఇప్పుడు ఆ హీరో రాజకీయ ప్రవేశం ఖరారైనట్టేనా? ఈ రోజు రజినీకాంట్ స్పీచ్ విన్నవాళ్ళందరికీ వచ్చిన అనుమానం ఇదే. రజినీ చేసి అత్యద్బుత ప్రసంగం అందర్నీ ఆలోచనలో పడేసింది... ఆ వివరాలు

    సూపర్ స్టార్ రజనీకాంత్

    సూపర్ స్టార్ రజనీకాంత్

    ఎక్కడైనా సినిమాకు ఇంత స్థాయిలో హైప్ వస్తుందా..? ఓ హీరో బొమ్మతో బంగారు నాణేలు విడుదలవుతాయా..? సినిమా పోస్టర్లను విమానాల మీద ముద్రిస్తారా..? ఒక సినిమా ఒకేసారి వేల థియేటర్లలో రిలీజ్ అవుతుందా..? ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సినిమా విడుదల తేదీన అధికారికంగా సెలవు ప్రకటిస్తుందా..? నమ్మలేని నిజాలనిపించే ఈ విశేషాలను కబాలి సినిమాతో నిజం చేసి చూపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్.

    ఇంటర్ నేషనల్ సూపర్ స్టార్

    ఇంటర్ నేషనల్ సూపర్ స్టార్

    నిన్నటి వరకు సౌత్ సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీ.. ఇంటర్ నేషనల్ సూపర్ స్టార్ గా అవతరించాడు. బస్ కండక్టర్ నుంచి భారతీయులు గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చిన రజనీ అసలు తమిళుడు కాదంటే ఇప్పుడు ఎవ్వరూ ఒప్పుకోరు. అంతదాకా ఎందుకు మహారాష్ట్రియన్లే ఆయనని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గానే గుర్తుపెట్టుకుంటారు...

    మరాఠీ వాడైన శివాజీ రావ్ గైక్వాడ్

    మరాఠీ వాడైన శివాజీ రావ్ గైక్వాడ్

    సహజంగానే ఉండే ప్రాంతీయాభిమానం తమిళులకు మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ అది అందరూ అనుకునేంత తీవ్రంగా మాత్రం ఉండదు. అలాగే తమిళులు దైవం లా చూసుకునే "మరాఠీ వాడైన శివాజీ రావ్ గైక్వాడ్" కూడా అతనే ఇప్పుడు సూపర్ స్టార్ అని పిలుచుకునే రజినీ కాంత్.

    రజనీకాంత్ గా

    రజనీకాంత్ గా

    రజనీ కాంత్ ప్రతి హోలీ పండుగకు త న గురువు బాలచందర్‌ బతికున్న రోజుల్లో ఆయనకు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకునే వాడట. కానీ హోలీ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. కొ న్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'శివాజీ రావ్ గైక్వాడ్ గా ఉన్న నా పేరును రజనీకాంత్ గా మార్చింది హోలీ రోజునే సార్‌!" అంటూ చెప్పాడట.

    అభిమానులతో భేటీ

    అభిమానులతో భేటీ

    'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ భద్రంగా దాచుకున్నాడు. ఇంతకీ ఇప్పుడు ఎప్పుడో రజినీ కూడా మరిచి పోయిన శివాజీ రావ్ ఇన్నాళ్ళకి మళ్ళీ ఎందుకు గుర్తొచ్చాడూ అంటే..? తమిళనాడులోని అభిమానులతో భేటీ సందర్భంగా రజనీ తన స్థానికత అంశాన్ని లేవనెత్తాడు.

     రాజకీయ ప్రవేశంపై

    రాజకీయ ప్రవేశంపై

    ఆయన రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానులతో చివరి రోజు భేటీ ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైలోని కొడాంబక్కంలో తన అభిమానులను కలుసుకున్న సందర్భంగా రజినీకాంత్‌ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. తాను పొరుగు రాష్ట్రానికి చెందిన వ్య‌క్తిని కాద‌ని, ఇప్పుడు పక్కా తమిళుణ్ని అని తెలిపారు.

    అభిమానులు నన్నుతమిళుణ్ని చేశారు

    అభిమానులు నన్నుతమిళుణ్ని చేశారు

    కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నానని, తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నానని రజనీ తెలిపారు. తాను పుట్టింది మహారాష్ట్రలో అయినా అభిమానులు తనని తమిళుణ్ని చేశారు ఇకనన్ను తమిళుడు కాదని ఎవరంటారూ? అంటూ ప్రసంగం మొదలు పెట్టిన తలైవా.. నేను కర్ణాటకలో 23సంవత్సరాలు జీవించాను.

    తమిళుడిగా మార్చారు

    తమిళుడిగా మార్చారు

    అలాగే తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నాను. నేను కర్ణాటక నుంచి నాకు ఘనస్వాగతం పలికారు.. నన్నొక నిజమైన తమిళుడిగా మార్చారు. నేను ఇప్పుడు పక్కా తమిళుయుడిని. రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది. దానిని ప్రక్షాళన చేయాల్సి ఉంది' అని ఆయన చెప్పారు. తనను తమిళనాడు నుంచి వెళ్లిపొమ్మంటున్నారని, అలా వెళ్లిపోయే ప్రసక్తి లేదని రజినీకాంత్‌ చెప్పారు.

    మీడియా నన్ను తరుముతోంది

    మీడియా నన్ను తరుముతోంది

    తాను పక్కా తమిళుడినే అన్న ఆయన తాను ఏం మాట్లాడినా మీడియా తనను తరుముతోందని, సంచలనం చేస్తోందని, ఇందుకు రాజకీయాలే కారణం అని అన్నారు. తాను ఎంతో క్రమ శిక్షణతో ఉండటం వల్లే ఇలా ఉన్నానని చెప్పిన రజినీ ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చినప్పుడు తన గొంతు వినిపిస్తానని చెప్పారు.

    పోరాటం వచ్చినప్పుడు

    పోరాటం వచ్చినప్పుడు

    ‘ మీతోపాటే నాక్కూడా బాధ్యతలు, పనులు ఉన్నాయి. ఇప్పుడవి చేద్దాం. కానీ, తప్పనిసరి పోరాటం వచ్చినప్పుడు మనందరం చూస్తాం' అని ఆయన అన్నారు. సరైన సమయంం వచ్చినప్పుడు అభిమానం చూపించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

    వ్యవస్థ చెత్తగా మారినప్పుడు

    వ్యవస్థ చెత్తగా మారినప్పుడు

    ‘రాజకీయాల్లో ఎంతోమంది సీనియర్‌ నాయకులు ఉన్నారు. జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ, వ్యవస్థ చెత్తగా మారినప్పుడు మనమేం చేస్తున్నాం. ప్రజాస్వామ్యం భ్రష్టుపడిపోయింది. వ్యవస్ధ మారాలి. ప్రజల ఆలోచనల్లోంచి మార్పు రావాలి. అప్పుడే దేశం సరైన మార్గంలో ముందు కెళుతోంది' అని రజినీ చెప్పారు.

    వ్యవస్థ అధ్వానంగా తయారైంది

    వ్యవస్థ అధ్వానంగా తయారైంది

    ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందన్న రజనీకాంత్ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. "మన వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. చెడ్డ రాజకీయ నాయకులతోపాటు, నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారు. కుళ్లిన వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

    పక్కా రాజకీయ ప్రసంగమే

    పక్కా రాజకీయ ప్రసంగమే

    అయితే తన రాజకీయ ప్రవేశంపై మాత్రం సమాధానాన్ని రజనీ మరోసారి దాటవేశారు. రాజకీయాల్లోకి ప్రవేశం మీద ఖచ్చితంగా ఒకప్రకటన చేయకుండానే ఇంత భావోద్వేగం తో ప్రసంగించిన రజినీ స్పీచ్ విన్న రాజకీయ వేత్తలూ, విశ్లేషకులూ మాత్రం ఇది పక్కా రాజకీయ ప్రసంగమేననీ... రజినీ రాకకు తమిళ రాజకీయాలు సిద్దంగా ఉండాలనీ అభిప్రాయ పడుతున్నారు.

    English summary
    "I lived in Karnataka for 23 years and in Tamil Nadu for 43 years. Though I am from Karnataka, you welcomed me and made me a true Tamilian," Rajinikanth said on Friday. While he did not invoke any names when he made the statement, it was clearly a jibe at those mocking him for not being a Tamilian.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X