నాగార్జునని నేను ఇన్సల్ట్ చేయలేదంటూ ఆమె
"నేను నాగార్జునని ఇన్సల్ట్ చేసానంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్స్ మాత్రమే. నేను బెజవాడ షూటింగ్ సమయంలో ఆయన్ని అవమాన పరిచానంటూ వార్తలు ప్రచారం చేసారు. అదంతా అబద్దం. ఇప్పటివరకూ ఆయన్ని నేను కలవనేలేదు. ఎందుకు ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారో అర్దం కావటం లేదు. వీటిని ఎదుర్కోవటానికే నేను ట్విట్టర్ ఎక్కౌంట్ తెరిచాను. ఇలాంటి రూమర్స్ అన్నిటికి నేను ట్వీట్స్ ద్వారా సమాధానమిస్తాను" అంది అమలా పౌల్.
ఇక నాగచైతన్య చిత్రం బెజవాడ ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మపై రకరకాల రూమర్స్ గుప్పుమంటున్నాయి. విక్రమ్ తో నాన్న సినిమాను చేసిన దర్శకుడు విజయ్ ఆమెకు చెన్నైలో ఓ ప్లాట్ కొనిచ్చాడంటూ కొద్ది రోజుల క్రితం రూమర్ వచ్చింది. దానిని సైతం ఆమె ఖండించింది. ఇక బెజవాడ చిత్రం హిట్టైతే తెలుగులో వరస ఆఫర్స్ వస్తాయని ఆమె భావించింది. అయితే ఆమె అనుకున్నట్లు జరగలేదు. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన బెజవాడ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో తెలుగులో ఆమెకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. దాంతో తమిళంలోనే ఆమె కంటిన్యూగా సినిమాలు ఒప్పుకుంటోంది. అక్కడ పెద్ద స్టార్స్ ఆమెతో చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అమలా పౌల్ మాత్రం తన వయస్సుకు తగ్గ యువ హీరోలతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకుని అందుకు తగిన పాత్రలను,సినిమాలను మాత్రమే కమిటవుతోంది.


Click it and Unblock the Notifications