నిఝం...ఆ ఆరాటం అస్సలు లేదు: శ్రియ
అసలు నాకా ఊహే చాలా భయంగా ఉంది. గతం గతః అంటారు కదా. ఈ జన్మలో జరిగిన సంఘటనలను అప్పుడప్పుడు గతంలోకి వెళ్లి తల్చుకుంటాను కానీ ఏకంగా గత జన్మ గురించి తెలుసుకోవాలనే ఆరాటం అస్సలు లేదని శ్రియ శెలవిస్తోంది. ఇటీవల సెలీనా తన గత జన్మ గురించి తెలుసుకుంది కదా. మీకలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నను శ్రియ ని మీడియా వారు అడిగితే ఇలా చెప్పుకొచ్చింది..అలాగే మరుజన్మ ఉంటుందనే నమ్మకం మాత్రం ఉంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను' అంది శ్రియ. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రవితేజ సరసన తెలుగులో 'డాన్ శీను'లో హీరోయిన్ గా చేస్తోంది. పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో ఐటం సాంగ్ లో కనపించనుంది. తమిళంలో ఆర్య సరసన 'చికుబుకు', జీవా సరసన 'రౌద్దిరం' అనే చిత్రాల్లో చేస్తున్నారు.
మలయాళంలో శ్రియ నటించిన 'పోకిరి రాజా' ఇటీవల విడుదలై శ్రియకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఇంతకాలం గ్లామర్ పాత్రలు కావల్సినన్ని చేశానని, ఇకనుంచి నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నానని శ్రియ చెప్తోంది. పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో తాను చేస్తున్న ఐటం సాంగ్ ని కొంతమంది అవకాశాలు లేక చేస్తున్నట్లుగా భావించి మాట్లాడుతున్నారని అది తప్పని శ్రియ చెప్పుకొచ్చింది. సినిమాల్లో క్రేజీ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడంలో తప్పుందని నేననుకోను. ఒకే హీరోయిన్‌పై సినిమాలోని పాటలన్నీ చిత్రీకరిస్తే చూసే రోజులు పోయాయి. అందుకే దర్శకనిర్మాతలు తమ చిత్రాల్లో ఒకరికంటె ఎక్కువమంది హీరోయిన్లను తీసుకుంటున్నారు. అంతేకాదు..నాలాంటి క్రేజీ హీరోయిన్లతోనూ స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేయిస్తున్నారు. అందులో తప్పుపట్టడానికేమీ లేదని నా అభిప్రాయం" అంది శ్రియ.


Click it and Unblock the Notifications











