ఐ డోంట్ కేర్ అంటోన్న రామ్ చరణ్ హీరోయిన్

By Sindhu

రామ్ చరణ్, తమన్నా హీరోహీరోయిన్లుగా చేస్తున్న చిత్రం రచ్చ. ప్రస్తుతం ఈ రచ్చ షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. అయితే ఏంటట.. అనంటే, శ్రీలంకలో కోలీవుడ్‌ లో నటించే తారలు షూటింగ్‌ లో పాల్గొంటే కోలీవుడ్ ఇండస్ట్రీ వారిపై నిషేధం విధిస్తుంది. ఎందుకంటే అక్కడి తమిళులపై శ్రీలంక అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కోలీవుడ్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో అసిన్ ఈ నిబంధనను అతిక్రమించడంతో ఆమెపై వేటు పడింది.

ఇపుడు తమన్నా కూడా 'రచ్చ"కోసం శ్రీలంక వెళితే వేటు వేయడం ఖాయమంటున్నారు కోలీవుడ్ సినీజనం. అయితే ఈ వేటులకు తానేమీ భయపడబోనని తమన్నా చెప్పినట్లు భోగట్టా. దానికి కారణం… ఈ మిల్కీ బేబీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో కోటి రూపాయల పారితోషికం ముడుతోంది. పైపెచ్చు మరో మూడు నాలుగేళ్ల దాకా సరిపడే ప్రాజెక్టులు చేతినిండా ఉండటంతో ఈ బ్యాన్లను కేర్ చేసే పరిస్థితిలో తమన్నా లేదట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X