అజిత్‌ను బాలీవుడ్లోకి లాగే ప్రయత్నం చేస్తున్న బోనీ కపూర్!
'విశ్వాసం' తర్వాత అజిత్ నటిస్తున్న మూవీ 'నెర్కొండ పార్వాయ్'. బాలీవుడ్ సూపర్ హిట్ 'పింక్' చిత్రానికి ఇది తమిళ రీమేక్. 'పింక్' చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను అజిత్ చేశారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. బేవ్యూస్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పి బేనర్లో ఆయన ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తీరన్ మూవీ ఫేం హెచ్ వినోద్ దర్శకత్వంలో 'నెర్కొండ పార్వాయ్' తెరకెక్కుతోంది.
తాజాగా 'నెర్కొండ పార్వాయ్' గురించి బోనీ కపూర్ ట్వీట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ రషెస్ చూశాను. చాలా సంతోషంగా ఉంది. అజిత్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అతడు త్వరలోనే హిందీ సినిమాలు చేయడానికి అంగీకరిస్తాడనే నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.

తన వద్ద అజిత్‌కు సూటయ్యే 3 స్క్రిప్టులు ఉన్నాయని, అందులో ఏదో ఒకదానికి అజిత్ ఒప్పుకుంటారనే ఆశతో ఉన్నట్లు బోనీ కపూర్ తెలిపారు. బోనీ ట్వీట్ చూస్తుంటే అజిత్‌ను బాలీవుడ్లోకి లాగడం ఖాయంగా కనిపిస్తోంది.
' నెర్కొండ పార్వాయ్'లో అజిత్‌తో పాటు శ్రద్ధ శ్రీనాథ్, విద్యా బాలన్, అధిక్ రవిచంద్రన్, అర్జున్ చిదంబరం, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియాంగ్, అశ్విన్ రావు, సుజిత్ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విద్యాబాలన్‌కు తమిళంలో ఇదే తొలి చిత్రం.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా... నిరవ్ షా సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. గతంలో ఈ చిత్రం మేలో విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే రూమర్లకు తెర దించుతూ ఆగస్టు 10న సినిమా విడుదల చేయబోతున్నట్లు బోనీ కపూర్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











