కాల్చి చంపేస్తానని బెదిరించిన హీరో..కేసు
తమిళ హీరో శింబు ఎప్పుడూ ఏదో ఒక కేసులోనో,వివాదంలోనో ఉండటం పరిపాటి అయిపోయింది.తాజాగా తిరుచ్చికి చెందిన డిస్ట్రిబ్యూటర్ రామ్మూర్తి వీరిపై తనను కాల్చి చంపేస్తానని బెదిరించాడని,శింబు నుంచి తనకు ప్రాణాపాయం ఉందని కేసు ఫైల్ చేసారు.చెన్నై కమిషనర్ ని కలిసి పెట్టిన కేసులో వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో రామ్మూర్తి ఓ సినిమా విషయమై శింబు,రాజేంద్రలకు యాబై తొమ్మిది లక్షలు రూపాయలు అప్పు ఇచ్చానని,అందులో ఇంకా ముప్పై లక్షలు రూపాయలు తిరిగి ఇవ్వాలని,అందుకు కలిస్తే ఇంటికొచ్చి పట్టుకెళ్ళమన్నారని చెప్పారు.
ఇంటికి వెళ్ళిన తనని అవమానం చేసి దుర్బాషలాడి బ్రతికుండగానే కాల్చి చంపేస్తానని శింబు వార్నింగ్ ఇచ్చాడని,ఇక అప్పు విషయం మర్చిపొమ్మని చెప్పాడని ఆ కంప్లైంట్ లో రాసారు.ఇక శింబు ఈ విషయమై మాట్లాడటానికి మీడియా వద్ద నిరాకరించారు.ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరో తనకు తెలియదని,తన తండ్రి రాజేంద్ర ఈ వ్యాపార లావాదేవీలన్నీ చూస్తాడని చెప్తున్నాడు.ఇక ప్రస్తుతం శింబు రెండు తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వేదం రీమేక్ లో చేసారు.


Click it and Unblock the Notifications











