జోష్ చిత్రంలో నటించినందుకు నేనేమీ...కార్తీక
రాధ కూతురు కార్తీక నాగార్జున కుమారుడు పరిచయ చిత్రం జోష్ లో ద్వారా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఫ్లాఫ్ అవటంతో రాధకూ నిర్మాత దిల్ రాజుకూ మద్య అప్పట్లో చిన్న పాటి గొడవ చోటు చేసుకుంది. తమకో పాత్ర చెప్పి తెరపై వేరే విధంగా తన కూతురుని లాంచ్ చేసారని కస్సుబుస్సు లాడింది రాధ. తాము మోసపోయినట్లు భావిస్తున్నామని తమిళ పత్రికలకు చెప్పింది. అయితే ఆ ఇష్యూని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. సినిమా పోవటంతో వచ్చే ప్రస్టేషన్ గా సరిపెట్టుకున్నారు. అయితే ఈ విషయాలకు కార్తీక ఈ మధ్య ఓ లీడింగ్ న్యూస్ పేపర్ లో రీసెంట్ గా సమాధాన మిచ్చింది.ఆమె మాటల్లోనే...నాకు తెలుసు జోష్ చిత్రం నాగార్జున కుమారుడు చైతన్య ను లాంచ్ చేయటానికి అని...అందుకే అతని మీదే పూర్తి స్ధాయి ఫోకస్ పెట్టారు. అయితే రిజల్టు ఏ విధంగా వచ్చిందన్న దాని గురించి నేను మాట్లాడను. నేను ఏదైతే తెరమీద చేసానో దానని ఇప్పటికీ ఇష్టపడుతున్నాను..నేను దాని గురించి అస్సలు భాధపడటం లేదు అని తెల్చేసింది. ప్రస్తుతం ఆమె సంతోష్ శివన్ సరసన ఓ మళయాళ చిత్రంలో చేస్తోంది. అలాగే నాగచైతన్య..తన తదుపరి చిత్రం ప్రముఖ తమిళ దర్శకుడు గౌతం మీనన్ డైరక్షన్ లో చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











