సూపర్‌స్టార్‌కు పోటీ ఇంకెవరు నేనే' అన్న పవర్‌ స్టార్

By Srikanya

చెన్నై : సూపర్ స్టార్ కి పోటీ ఎవరు...అంటే...నేనే పవర్ స్టార్ ని పోటీ అంటూ తేల్చి చెప్పాడు తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్. తెరపై స్థిరపడ్డాక బిరుదులు దక్కించుకునేవారు కొందరైతే డా||శ్రీనివాసన్‌ మాత్రం అందుకు భిన్నం. ఆయన తెరంగేట్రమే'పవర్‌స్టార్‌' పేరుతో చేశాడు. మనసులోని మాటను బయటపెట్టేందుకు ఏ మాత్రం తటపటాయించని పవర్‌స్టార్‌ సంచలన వ్యాఖ్యలతో దుమ్మురేపుతున్నాడు.

రీసెంట్ గా ఓ తమిళ పత్రికలో ఇచ్చిన ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌కు పోటీ అంటే అది పవర్‌స్టారే అని బాంబు పేల్చాడు. ప్రస్తుతం మరో అడుగు ముందుకేశాడు. ఎవరి సరసన నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు తనదైన శైలిలోసమాధానం ఇచ్చాడు. అనుష్క, హన్సిక, సమంతలు కాదు.. ఐశ్వర్యరాయ్‌ తన సరిజోడీ అని తేల్చాడు.

తనకు తానే పవర్ స్టార్ బిరుదు ఇచ్చుకున్న తమిళ కామెడీ హీరో శ్రీనివాసన్. ఆయన తాజాగా ప్రాడ్ కేసులో ఇరుక్కుని అరెస్టు అయ్యారు. ఓ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అరవై ఐదు లక్షలు రూపాయలు చీట్ చేసారని ఆయనపై అభియోగం. తమిళ పరిశ్రమలో యాభై సంవత్సరాలు దాటాక పీల్డులోకి వ్చచి నటిస్తున్న ఈయన ఇంతకుముందు హీరోయిన్స్ నిత్యామీనన్, ప్రియా ఆనంద్ లకు కోటి రూపాయలు ఆఫర్ చేసి తన ప్రక్కన చేయమన్నాడు. అయినా వారెవ్వరూ ముందుకు రాలేదు.

ఛీటింగ్ కేసు వివరాల్లోకి వస్తే...యు.బి.ఎస్ ఇంటర్నేషనల్ అధినేత,వ్యాపార వేత్త అయిన జి.యు బాల సుబ్రమణియన్ ను మోసం చేసిన ఆరోపణలపై ఈ చెన్నై పవర్ స్టార్ ని శనివారం అరెస్టు చేసారు. తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి ఈ శ్రీనివాసన్ ని పది కోట్ల రూపాయలు సాయిం చేయాల్సిందిగా కోరాడు బాలసుబ్రణియన్. తనకు ఐదు శాతం సర్వీస్ చార్జ్ క్రింద మొదటే చెల్లించాలని అరవై ఆదు లక్షలు నొక్కేసాడు. ఆ కేసు నుంచే ఈ తమిళ పవర్ స్టార్ బయిటకు వచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X