సినిమా ఛాన్సులు అడుక్కోను : స్నేహ
చెన్నై : మంచి పాత్రల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. నచ్చితే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. అంతేకానీ సినిమా ఛాన్సులు ఇవ్వాలని ఎవరినీ అడుక్కోను అంటోంది హీరోయిన్ స్నేహ. పెళ్లియిన తర్వాత సినిమా కొంత కాలం గ్యాప్ ఇచ్చిన అమ్మడు మళ్లీ ఈ సంవత్సరం జోరు పెంచింది.
ప్రస్తుతం ఆమె దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తోంది. ఆమె సైన్ చేసిన తెలుగు ప్రాజెక్టుల విషయానికొస్తే.....శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ఏమిటో ఈ మాయ' చిత్రంతో పాటు, ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో రూపొందబోయే ఉలవచారు బిర్యానీ చిత్రంలో స్నేహ నటిస్తోంది.
హీరోయిన్స్ వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పేసి కొన్నేళ్ల తరవాత కొత్త ఇన్నింగ్స్ కి శ్రీకారం చుడతారు. అప్పుడు వాళ్లకి తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు దక్కుతుంటాయి. ఆ రూట్ లోనే స్నేహ ప్రయాణం పెట్టుకుంది. స్నేహ వివాహం గత సంవత్సరం తమిళ నటుడు ప్రసన్నతో జరిగిన విషయం తెలిసిందే.
హరిదాసు అనే తమిళ చిత్రంలో స్నేహ తల్లిపాత్ర పోషిస్తోంది. ''హరిదాస్ అనే తమిళ చిత్రంలో ఓ పదేళ్ల బాలుడికి తల్లి పాత్ర పోషించాను. కథలో నా పాత్ర కీలకమైనది కావడంతోనే అంగీకరించాను. దర్శకుడు నేనైతే బాగుంటుందని పట్టుబట్టారు'' అని స్నేహ చెబుతోంది.


Click it and Unblock the Notifications












