నేనలేదంటూ ప్రియమణి గోలెత్తిపోతోంది
అసలే వరస ప్లాపుల్లో ఉన్న ప్రియమణి కి మరో సమస్య వచ్చి మీద పడింది. ఆమె రీసెంట్ గా తాను ఇక తమిళ సినిమాలకు బై చెప్తున్నట్లు చేయనన్నానని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.దాంతో ప్రియమణిని తమిళ సినిమావారు అంత పాపం మేమేం చేసాను..మేం ఇక్కడ పరిచయం చేసి జాతీయ అవార్డు ఇప్పించటమే నేరమా అన్న రీతిలో కామెంట్స్ చేయటం మొదలెట్టారు.కొందరైతే ప్రియమణికి ఫోన్ లు చేసి మరీ కడిగేసారుట.దాంతో ప్రియమణి అస్సలు నేను ఎప్పుడూ ఆ కామెంట్ చేయలేదని మొత్త్తుకుంటోంది.ఆ విషయమై అమె మాట్లాడుతూ...నేను ఎప్పుడూ తమిళ పరిశ్రమకు గుడ్ బై అని ప్రకటించలేదు.త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్టుతో మంచి పాత్రతో వస్తాను.నన్ను ఆదరించి ఈ స్ధాయికి తెచ్చింది ఆ పరిశ్రమే..దానికి నేను ఎలా బై చెప్తాను..నేను కన్నడ,తెలుగు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తమిళ సినిమాలు ఒప్పుకోవటం లేదు.అంతేగాని తమిళ పరిశ్రమని వదిలేసినట్లు కాదు..అక్కడ పోటీకి భయపడి కాదు అని క్లారిఫై ఇచ్చింది.అదీ సంగతి.


Click it and Unblock the Notifications











