సెక్స్ సినిమాలో చేయలేదంటూ వివరణ
చాలా వెబ్ సైట్స్, తమిళ మ్యాగజైన్స్ లోరీమాసైన్ ఓ సాప్ట్ పోర్న్ ఫిల్మ్ లో చేస్తోందంటూ వార్తలు వచ్చాయి.అందుకాక ఆమె బేర్ బాడీతో వీపు చూపించే పోస్టర్ ని సైతం చూపెడుతూ న్యూస్ ప్రసారం చేసాయి.అయితే ఇప్పుడు రీమాసేన్ తాను అటువంటి సినిమా ఏదీ చేయలేదని,భవిష్యత్ లో కూడా చేయబోనని,పత్రికల్లో వచ్చిన ఆ ఫోటో కేవలం తాను గతంలో నటించిన ఓ బెంగాళి చిత్రంలోదని ఖండించింది.ఇది శ్రీకాంత పేరుతో ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీలోనూ డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారని చెప్పింది. అయితే అదే సమయంలో తమిళంలో ఈ చిత్రాన్ని ఇలవరసి టైటిల్ తో విడుదల చేస్తున్నారు.
ఈలోగా ఈ ఫోటోతో ఆమె ఓ సెక్స్ సినిమాలో చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఆమె అభిమానులు కంగారుపడి ఆమెను కలిసి విషయం వివరించారు. విషయం తెలుసుకున్న ఆమె అది బెంగాళీ సినిమా అని అటువంటి సీన్స్ ఏమీ లేవని,బయిట జరగుతున్న ప్రచారం అబద్దమని నమ్మవద్దని ఖండిస్తూ ప్రకటన చేసింది.ఇక ఇతి శ్రీకాంత చిత్రంలో ఆమె సెక్స్ వర్కర్ గా నటిస్తోంది.క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఆమె స్టిల్స్ ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది.అంతేగాక బెడ్ రూమ్ లో కనిపించే ఆ సీన్ కేవలం కొద్ది సెకన్లు మాత్రమే ఉంటుందని చెప్పింది.అంతేగాక ఈ చిత్రం చాల మంచి చిత్రమని,అనవసరంగా సెక్స్ సినిమా అని పబ్లిసిటీ చేస్తున్నారని వాపోయింది.


Click it and Unblock the Notifications











