షాక్ : శంకర్ ‘ఐ’ రిలీజ్ 2015కు వాయిదా
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ఐ' చిత్రం విడుదల కోసం సౌతిండియా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్లోనే విడుదల చేయాలనే ఉద్దేశ్యం కొన్ని రోజుల క్రితం ట్రైలర్ కూడా విడుదల చేసారు. అప్పటి నుండి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
అయితే ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు షాకిస్తూ....ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసారు. ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇది అభిమానులను నిరాశ పరిచే విషయమే.

గత కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం ఆడియో వేడుక చెన్నైలో గ్రాండ్ గా విడుదల చేసారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దాదాపు 2 సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకున్న ‘ఐ' చిత్రం సెప్టెంబర్ 24 షూటింగ్ పూర్తయింది.
ఈ చిత్రంలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఐ' సినిమాలో మూడు గెటప్స్ లో కనపడతాను. సినిమా మోడలింగ్ ఫీల్డ్ కి సంబంధించిన పాయింటతో రూపొందింది. మోడలింగ్ రంగంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడనేదే కోణంలో సినిమా ఉంటుంది. శంకర్ స్టయిల్ లో సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి ఫీలవుతారు అన్నారు.


Click it and Unblock the Notifications











