అమ్మతో కలిసిన నటించడం చాలా హ్యాపీ గా ఉంది: త్రిష
అందాలతార త్రిష ఇటీవల వాళ్లమ్మతో కలిసి నటించింది. అయితే, ఇదేదో సినిమాలో కాదు లెండి… ఓ అడ్వర్ టైజ్ మెంట్ కు సంబంధించిన ప్రచార చిత్రంలో ఈ తల్లీ కూతుళ్లు కలిసి నటించారు. త్రిష తల్లి ఉమా కృష్ణన్ ని గతంలో కొంత మంది సినిమాల్లో నటించమని అడిగినప్పటికీ ఆమె చేయలేదు. కోలీవుడ్ లో కమల్ హాసన్ ఆఫర్ ను కూడా తిరస్కరించిన విషయం తెలిసిందే.
అయితే, తాజాగా ఓ బాస్మతి రైస్ ప్రాడక్ట్ వాళ్లు తల్లీ కూతుళ్ల కాన్సెప్ట్ తో అప్రోచ్ అవడంతో ఆమె కాదనలేకపోయిందట. దీనికి సంబంధించిన షూట్ ను ఇటీవలే చెన్నై లో పూర్తి చేశారు. అమ్మతో యాక్ట్ చేస్తున్నంత సేపు చాలా హ్యాపీగా ఉన్నింది. బాగా ఎంజాయ్ చేశానని త్రిష అంటోంది. త్వరలో ఈ యాడ్ టీవీలలో ప్రసారమవుతుంది. అందుకుగాను ప్రముఖ సంస్థా ఈ తల్లి కూతుళ్ళకు భారీ పారితోషికం ముట్టజెప్పిందని సమాచారం. ఇదిలా ఉంచితే, ఉత్తరాది టీవీలలో ప్రసారానికి ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, వాళ్లమ్మాయి సోహా ఆలీఖాన్ లపై ఈ యాడ్ ను షూట్ చేశారు.


Click it and Unblock the Notifications











