విశాల్ తో కాదు నేను రవితేజను డైరక్ట్ చేయబోతున్నా
అవన్నీ జస్ట్ రూమర్స్..నేను ఎప్పుడూ విశాల్, తమన్నా కాంబినేషన్ గురించి అనుకోలేదు. అయినా నా తర్వాత ప్రాజెక్టు తెలుగులో ఉంటుంది.అది కూడా రవితేజతో. ఆ సినిమా ఓ యాక్షన్ కామిడీ. త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది అంటూ వివరించారు దర్శకుడు శివ. కెమెరామెన్ నుంచి దర్సకుడుగా మారిన శివ రీసెంట్ గా తమిళంలో విక్రమార్కుడు ని సిరుతై టైటిల్ తో రీమేక్ చేసి హిట్ కొట్టారు. దాంతో అక్కడ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయబోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి. అంతేగాక అందులో తమన్నా, విశాల్ చేస్తున్నారని ఇద్దరికి రెండు భాషల్లో మార్కెట్ ఉందని వినిపించాయి. ఈ విషయమై క్లారిటీ ఇస్తూ శివ ఇలా వివరించారు. ఇక రవితేజ ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు చిత్రం కమిటయ్యారు. వైవియస్ చౌదరి నిర్మాతగా ఆ చిత్రం రూపొందనుంది.


Click it and Unblock the Notifications











