దర్శక, నిర్మాతలు పట్టుబట్టి సెక్సీగా..నమిత కంప్లైంట్
నిజం..నన్ను నమ్మండి..డైరక్టర్సే నా చేత బికినీ తొడిగించటం, షార్ట్స్ వేయించటం, సెక్సీ గా కనిపించేలా చేయటం చేస్తున్నారు. నాకైతే సంప్రదాయబద్దమైన దుస్తులు వేసుకుని తెరపై నిండుగా కనపడాలని ఉంటుంది. అయితే అవకాశాల కోసం దర్శక,నిర్మాతలు చెప్పినట్లు వినాల్సిందే కదా అంటోంది నమిత. ఆమె తన మనస్సులో మాటలను బయిటకు చెప్తూ...నా తోటి హీరోయిన్స్ అంతా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ పోతూంటే నాకు అసూయగా ఉంది. కానీ ఎవరూ నాకు నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆఫర్ చేయటం లేదు. నేను నా సెక్సీ ఇమేజిని మార్చుకోవాలనుకుంటున్నాను. ఢిఫెరెంట్ రోల్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. చూడండి రాబోయే తమిళ చిత్రం ఇళిగన్ లో నా పాత్ర ఎంత కొత్తగా ఉంటుందో అంటంది. ఇక నాకు ఇష్టమైంది శ్రీదేవి సద్మా చిత్రంలో చేసిన పాత్ర లాంటిది. భవిష్యత్ లో అలాంటి పాత్ర చేసే రోజు వస్తుందని ఆశిస్తున్నాను అంది నమిత. ఇంతకీ నమిత అలాంటి పాత్ర చేస్తే చూడ్డానికి అభిమానులు మిగిలి ఉంటారా...


Click it and Unblock the Notifications











